- అధికారులు కాన్వాసింగ్ చేసి ప్రజలను పునరావాసానికి తరలించాలి...
ప్రజాశక్తి-వి.ఆర్.పురం : మండలంలో 20వ తేదీన వరద పెరగటంతో అధికారులు కాన్వాసింగ్ చేసి ప్రజలను పునరవాస కేంద్రాలకు తరలించారు. ఇప్పటికీ ఐదు రోజులు కావస్తున్న పునర్వాస కేంద్రంలోఉన్న ప్రజలకు ఎటువంటి సౌకర్యాలు కల్పించక పోవడంతో అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారని సిపిఎం నాయకులు, పూనెం సత్యనారాయణ, సోయం చిన్నబాబు ఆరోపించారు. సోమవారం తాత్కాలిక శిబిరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిత్యవసర సరుకులు, బియ్యం, కిరోసిన్, బరకం, వంటి సదుపాయాలు కల్పించాలని సూచించారు. ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించి వారికి ఎటువంటి సౌకర్యాలు చేయకుండా అధికారులు చోద్యం చూస్తున్నారని వారు ఆరోపించారు. ట్రావెలింగ్ చార్జీ కనీసం 2000 దాకా అవుతుందని మళ్లీ గృహాలకు వెళ్లాలన్న ట్రావెలింగ్ చార్జి 2000 అవుతుందని ఎవరు భరిస్తారని వారు ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం కనీసం తిండిపెట్టే పరిస్థితిలో లేదని విమర్శించారు. తక్షణమే వారికి పదివేల రూపాయలు ఇచ్చివారికి నిత్యవసర సరుకులు, కిరోసిన్, బియ్యం, పాలు, అందించాలని అధికారులను నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు గూటాల శ్రీనివాసరావు, సీరపు తాతబాబు, నిర్వాసితులు పాల్గొన్నారు. విఆర్ పురం ఒడ్డుగూడెం గ్రామం వాసి వాగుల గోవిందరాజు మాట్లాడుతూ అధికారులు కాన్వాసింగ్ చేసి మమ్మల్ని పునర్వాస కేంద్రాలకి పంపించారు. ఇప్పటికీ ఐదు రోజులు కావస్తున్న అధికారులు ఇంతవరకు వచ్చి చూడలేదని మాకు నిత్యవసర సరుకులు ఇవ్వలేదని ఒడ్డుగూడెం గ్రామం నుండి సామాలతో ఇక్కడికి రావడానికి ట్రావెలింగ్ చార్జి 2000 అయిందని మళ్లీ వెళ్లాలంటే మల్ల రెండు వేలు ఖర్చు అవుతుందని పాల ప్యాకెట్ కానీ మంచినీరు గాని అందించలేదని రాత్రి వేళలో దోమల దోమలతో నరకం చూస్తున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఐదు రోజులు ఎట్నుంచి ఏ పురుగు వస్తుందని భయంతో జీవిస్తున్నామని తక్షణమే మాకు ట్రావెలింగ్ చార్జీలు ఇచ్చి నిత్యవసర సరుకులు ఇవ్వాలని అధికారులను ప్రజలు డిమాండ్ చేస్తున్నారు..










