Mar 27,2023 15:48

ప్రజాశక్తి-విఆర్ పురం: మార్చి 27న మండలంలోని రేఖపల్లి సిపిఎం కార్యాలయంలో జరిగిన విలేకర్ల సమావేశంలో సిపిఎం మండల కార్యదర్శి సోయం చిన్నబాబు మాట్లాడుతూ ఈనెల 31న జరిగే రాష్ట్రవ్యాప్త మన్యం బందుకు సిపిఎం పూర్తి మద్దతిస్తుందని బీసీ కులాలకు చెందిన బోయ వాల్మీకి, బెంతు ఒరియాలను ఎస్టీ జాబితాలోకి చేర్చుతూ అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేయడాన్ని నిరసిస్తూ ఈనెల 31న తేదీన జరిగే రాష్ట్ర వ్యాప్త మన్యం గిరిజన బంద్ కు ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు. ఎస్టీలకు ఉన్న చాలా రకాల రిజర్వేషన్ తీసివేశారు కొన్ని నెలలు ముందుగానే జీవో నెంబర్  3ని రద్దు చేశారు అలాగే 170 ఆక్ట్ ని కూడా రద్దు చేయాలని ప్రభుత్వం చూస్తుంది. ఈ తరుణంలో బోయ వాల్మీకి ఎస్టీ జాబితాలో ప్రభుత్వాన్ని కలుపుతూ అసెంబ్లీలో తీర్మానం చేయటం ఏమిటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు నిజంగా ఈ ప్రభుత్వానికి ఆదివాసుల మీద ప్రేమ ఉందా ఉంటే ఇలాంటి నిర్ణయాలు ఎలా తీసుకుంటారు. ఈ తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెడుతూ ఉంటే ఆదివాసి ఎమ్మెల్యేలు గెలిచిన ప్రజాప్రతినిధులు చేస్తున్నారని . ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకునే వరకూ పోరాటం ఉధృతంగా చేస్తామని సిపిఎం మండల కార్యదర్శి సోయం చిన్నబాబు డిమాండ్ చేశారు. సమావేశంలో గిరిజన సంఘ నాయకులు పాల్గొన్నారు.