- సంతాపం తెల్పిన నాయకులు
ప్రజాశక్తి-విఅర్ పురం : మండలంలోని కోటారు గొమ్ము గ్రామానికీ చెందిన కటకల వెంకటేశ్వర రెడ్డి(67) గత కొంతకాలంగా అనారోగ్యంతో ఉంటు సోమవారము తుది శ్వాస విడిచారు. మృతుడు వేంకటేశ్వర రెడ్డికి కూతుర్లు నాగమణి పండమ్మ కుమారుడు ప్రతాప్ రెడ్డి ఉన్నారు. మృతి చెందిన కటకల వేంకటేశ్వరరెడ్డి భౌతికకాయాన్ని సిపిఎం మండల కార్యదర్శి సోయంచినబాబు నాయకుల సందర్శించి భౌతికాయంపై ఎర్రజెండాను కప్పి ఘనంగా నివాళులర్పించారు. వల్ల కృష్ణారెడ్డి శాఖా కార్యదర్శి వినోద్ రెడ్డి, నాయకులు బొజ్జి రెడ్డి, అంజి రెడ్డి, శ్రీరాములు రెడ్డి, జామా రెడ్డి, రమాదేవి వరలక్ష్మి ప్రసాద రెడ్డి, తదితరులు పాల్గన్నారు.










