Jun 29,2023 15:26
  • ఇంటికో మనిషి.. ఊరుకో బండి.. కదిలి రావాలని సిపిఎం మండల నాయకులు పిలుపు

ప్రజాశక్తి-విఆర్ పురం: విజయవాడలో నాలుగోవ తేదీన జరిగే మహాధర్నాకు ఇంటికో మనిషి ఊరుకో బండి కదలి రావాలని మహాధర్నా విజయవంతం చేయాలని సిపిఎం మండల నాయకులు పిలుపునిచ్చారు. మండలంలోని జీడి గొప్ప గ్రామంలో వంకు సత్తిబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో   జిల్లా కమిటీ సభ్యులు పూనేం సత్యనారాయణ సోయం చిన్నబాబు వారు మాట్లాడుతూ కాంటురు సంబంధం లేకుండా 2022లో వచ్చిన వరదలకు మునిగిపోయిన గ్రామాలన్నిటికీ నష్టపరిహారం ఇవ్వాలని, యువతి యువకులకు 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి కాళీ చేసే నాటికి నష్టపరిహారం ఇస్తూ ఉపాధి కల్పించాలని,  41.15 కాంటురు పరిధిలోగల గ్రామాలకు ఒక్కొక్క గ్రామంలో 10-20 మంది దాకా కుటుంబాలకు డబ్బులు పడలేదని, చనిపోయిన వారికి కూడా డబ్బులు పడలేదని ఆ కుటుంబాల అందరికీ డబ్బులు పడేలా చూడాలని డిమాండ్ చేశారు.  ప్రతి గ్రామంలో నుంచి ఇంటికి ఒక మనిషి ఊరుకోక బండి విజయవాడలో నాలుగో తేదీన జరిగే మహాధర్నాకు ప్రజలు నిర్వాసితులు కదలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల నాయకులు కమ్మచ్చిచ్చుసత్యనారాయణ, సీరపు తాతబాబు, కొండారెడ్డి, ఖాదర్, బిక్షమ్, తదితరులు పా ల్గొన్నారు