Feb 09,2023 12:56
  • రైతుల శాపనార్థాలు తలిగి కనుమరుగై పోతారు 
  • సిపిఎం జిల్లానాయకులు పూనెం సత్యనారాయణ 

ప్రజాశక్తి - విఆర్.పురం : ఎండకు ఎండి, వానకు తడిసి, ఆరుగాలం పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేకపోగా ఆర్.బి.కె.కేంద్రాల్లో కనీస రక్షణ చర్యలు తీసుకోవడం లేదని సిపిఎం జిల్లా నాయకులు పూనెం సత్యనారాయణ ఆరోపించారు గురువారం ఆర్.బి.కె,సెంటర్లలో రైతులను ఉద్దేశించి ప్రసంగించారు అధికారులు, ప్రభుత్వం, రైతులు పండించిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని సూచించారు. పశువులు, మేకలు, పందులు, రైతులు,ఆర్.బి.కె.సెంటర్ కి తీసుకొచ్చిన ధాన్యాన్ని తింటున్నాయని, అధికారులు రక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కష్టపడి రైతు పండించిన  పంటను దుబారా, పశువులు పాడుచేస్తే ఆపాపం ఊరికే పోదని ఆయన అన్నారు. ఈ ఆర్.బి.కె సెంటర్ ను పరిశీలించిన, వారిలో మండల కార్యదర్శి సోయం చిన్నబాబు, ఎం.పి.టి.సి.పూనెం ప్రదీప్ కుమార్, రైతులు, తదితరులు పాల్గొన్నారు.