Apr 19,2023 15:49
  • ఉపాధి హామీ కూలీలకు మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రచార బేరి బృందం..
  • కారం గూడెం గ్రామంలో ప్రజలకు మంచినీళ్లు సమస్య తీర్చాలని ప్రచార బేరి డిమాండ్...

ప్రజాశక్తి-వి ఆర్ పురం(అల్లూరి) : మండలంలోని సిపిఎం అండ్ సిపిఐ ఉమ్మడి భాగంగా  ఐదవ రోజున ప్రసార బేరి కార్యక్రమంలో. బుధవారం రోజున సిపిఎం కార్యదర్శి సోయం చిన్నబాబు ఆధ్వర్యంలో ఐదవరోజు తెల్లవారి గూడెం కారంగూడెం. గుల్లెట్ వాడ. మూడు గ్రామంలో ప్రచార బేరి కార్యక్రమం భాగంగా ప్రతి ఇంటికి కరపత్రాలు పంచుతూ వాళ్ల సమస్యలు తెలుసుకుంటూ ఉపాధి హామీ పనిచేస్తున్న ప్రదేశాలను. ప్రచార బేరి బృందం సందర్శించడం జరిగింది  ఉపాధి హామీ కూలీలు ప్రచార బేరి బృందం ముందు తమ సమస్యలను ఎండలు ఎక్కువగా ఉన్నాయని ప్రభుత్వం ఎలాంటి మౌలిక సదుపాయాలు కల్పించలేదని మాకు కొలతలు ఎక్కువ ఇస్తున్నారని మేము చేయలేకపోతున్నామని. ఆవేదన వ్యక్తం చేశారు  తదుపరి సిపిఎం మండల కార్యదర్శి. సోయం. చిన్నబాబు మాట్లాడుతూ ఎండ తీవ్రతంగా ఉంటున్నాయి  కూలీలకు కొలతలు ఎక్కువగా ఇస్తున్నారని మౌలిక సౌకర్యాలు ఇవ్వకుండా పని ఎలా చేస్తారని  తక్షణమే కూలీలకు మౌలిక సదుపాయాలు కల్పించాలని ముఖ్యంగా తాగునీరు మజ్జిగ మెడికల్ కిట్టు టెంటు ఇవ్వాలని. తెల్లవారు గూడెం నుండి బుల్లెట్ వాడ వరకు ఉన్న రోడ్డును మూడు సంవత్సరాల నుండి నిలిచిపోయిందని ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని తక్షణమే రహదారుల పనులు.ప్రారంభించాలని అన్నారు కారం గూడెం గ్రామంలో తాగునీరు సమస్య ఎక్కువగా ఉందని బోరువేసి మోటార్ కలెక్షన్ ఇవ్వలేదని.సంబంధించిన అధికారులు స్పందించి ఆ గ్రామంలోని నీటి సమస్యను  మంచినీళ్లు సదుపాయం కల్పించాలని మోటార్ కి కలెక్షన్ ఇచ్చినీళ్లు అందించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.  ప్రజా స్వామ్య విలువలకు పాతరెస్తున్న బీజేపీ విధానాలను ప్రజలందరూ వ్యతెరికించాలని విజ్ఞప్తి చేశారు.ప్రజలు ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాలని కోరుతూ పోరాడుతుంటే,కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోంది అని తెలియజేశారు. .రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం బీజేపీకి పూర్తిగా లొంగిపోయి వ్యవహరిస్తుందని విమర్శించారు. .2019 ఎన్నికల ముందు రాష్ట్రానికి రావలసిన విభజన హామీలు అమలు చేయించే భాధ్యత తనదని చెప్పిన మన ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి ఏమీ చేస్తున్నారని. ప్రజలు నిలదీయాలని కోరారు.జగన్ మాటలు నమ్మి ప్రజలు తిరుగులేని మెజార్టీ ఇచ్చారని,కానీ ప్రజల ఆశలు ఆవిరి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల తరుపున కేంద్రంతో పోరాడతానని చెప్పిన జగన్ మోహన్ రెడ్డి, బీజేపీ ప్రభుత్వం,మోడీ అడుగు జాడాల్లో నడుస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు వడ్లది రమేష్. కుంజ నాగిరెడ్డి. కార్యకర్తలు తెల్లం. కన్నారావు. సత్తిరాజు. సున్నం. కోటప్ప. ముత్తయ్య తదితరులు పాల్గొన్నారు.