Apr 27,2023 15:13
  • వికలాంగులకు రావలసిన 50% రాయితీని తక్షణమే ఇవ్వాలని

ప్రజాశక్తి-విఆర్ పురం : ఉపాధి హామీ పనిచేస్తున్న కూలీలకు రోజుకి 150 రూపాయలు పడుతుందని వారానికి 900 రూపాయలు అవుతుందని వికలాంగులకు రోజుకి 80 రూపాయలు పడుతుందని, వారానికి 400 రూపాయలు అవుతుందని దీనిలో భాగంగా పని భారం పెరుగుతుందని ప్రచార భేరీలో భాగంగా చిన్న మట్టపల్లి గ్రామం  పంచాయితీ చింతరేగుపల్లి గ్రామంలో ప్రచార బేరి భాగంగా ఉపాధి హామీ కూలీలు పనిచేస్తున్న ప్రదేశాలను సందర్శించడం జరిగింది. ప్రచార బేరి బృందం ముందు కూలీలు తమ సమస్యలను వెళ్ళబుచ్చారు. తదుపరి సిపిఎం మండల  కార్యదర్శి సోయం చిన్నబాబు మాట్లాడుతూ ఉపాధి హామీ పనిచేస్తున్న గ్రూపులకు జనరల్ గ్రూప్ కి రోజుకి 150 రూపాయలు కూలి పడుతుందని ఆరు రోజులకి 900 రూపాయలు అవుతుందని పని భారం ఎక్కువ అవుతుందని తక్షణమే పని భారం  తగ్గించి రోజుకి 600 రూపాయలు ఇవ్వాలని వికలాంగులకు రోజుకి 80 రూపాయలు చొప్పున పడుతుందని, ఆరు రోజులకి 400 రూపాయలు అవుతుందని ప్రభుత్వం ఇప్పుడున్న పరిస్థితులను బట్టి రోజుకి 300 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నుండి వికలాంగులకు 50% రాయితీ రావాల్సి ఉందని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వికలాంగులకు వచ్చే రాయితీని ఆపేసింది అని  వెంటనే రాయితీని ఇవ్వాలని డిమాండ్ చేశారు. కూలీలకు రావాల్సిన అలవెన్స్  మజ్జిగ నీళ్ళు మెడికల్ కిట్టులు టెంట్ ఇవ్వాలనీ గునపం తట్ట పార కు కూలీ ఇవ్వాలని వైకాపా ప్రభుత్వం వచ్చిన తరవాత  ఉపాథి పని లాక్అలేవెన్స్ ఆపారని అన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలూ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నీరు కార్చుతున్నాయని విమర్శించారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన కొనసాగుతుందని విమర్శించారు రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం లేదని  ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చ కుండ పరిశ్రమల కల్పన కూడా లేకుండా పాలన సాగుతుందని ఆరోపించారు యువతకు ఉపాధి ఉద్యోగా అవకాశాలు లేవని కార్మికులకు కష్ట జీవులకు తిండి పెట్టలేని రైతులు పండించిన పంటకు గిట్టుబాటు లేకుండా సబ్సిడీలపై ప్రోత్సాహకాలు లేని పాలన కొన సాగుతుందని ఆయన విమర్శించారు  ప్రభుత్వం ఎంత అనుచివేత  ధోరణి అవలంబిస్తునా ప్రజల మద్దతుతో ఈ ప్రభుత్వాన్ని గద్దె దించటం ఖాయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు వడ్లాది రమేష్ కుంజా నాగిరెడ్డి కార్యకర్తలు ముత్యాల శివశంకర్ శ్రీరామ్మూర్తి నరసింహారావు ఉపాధి కూలీలు తదితరులు పాల్గొన్నారు.