- జగన్ మోడీ జోడి కట్టి ఆదివాసుల చట్టాలకు హక్కులకు భంగం కలిగిస్తున్నాయి ...
- గిరిజనులకు ముప్పు తలపెడుతున్న ప్రభుత్వాలు....
ప్రజాశక్తి-వి ఆర్ పురం : ఉపాధి హామీ పనిచేస్తున్న కూలీలకు పని భారం తగ్గించాలని చిన్న మట్టపల్లి గ్రామం పంచాయితీ గుండుగూడెం గ్రామం లో నీ ప్రచార బేరి భాగంగా ఉపాధి హామీ కూలీలు పనిచేస్తున్న ప్రదేశాలను సందర్శించడం జరిగింది. ప్రచార బేరి బృందం ముందు కూలీలు తమ సమస్యలను వెళ్ళబుచ్చారు తదుపరి సిపిఎం మండల నాయకులు వడ్లాది రమేష్ కుంజ నాగిరెడ్డి మాట్లాడుతూ తమ తమ స్వార్ధ రాజకీయ ప్రయోజనకోసం జగన్ మోడీలు జోడి కట్టి ఆదివాసీల చట్టాలను హక్కులను భంగం కలిగిస్తూ గిరిజనులకు ముప్పు తలపెడుతున్నారని ప్రభుత్వాలు అవలంబిస్తున్న గిరిజన వ్యతిరేక విధానాలను చాటి చెప్పి ప్రజల్లో చైతన్యం నింపేందుకు నేడు సిపిఎం సిపిఐ సంయుక్తంగా ప్రచార భేరి నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు సంక్షేమం పేరుతో ప్రభుత్వం అభివృద్ధిని పూర్తిగా అడ్డగించిందని విమర్శించారు నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని సామాన్యుల జీవన స్థితిగతులు పూర్తిగా దిగజారాయని అన్నారు ఉపాధి లేక పూట కూలీలు కార్మికుల జీవనం అస్తవ్యస్తంగా మారిందని విమర్శించారు అదేవిధంగా ఉపాధి హామీ పనిచేస్తున్న గ్రూపులకు జనరల్ గ్రూప్ కి రోజుకి 150 రూపాయలు కూలి పడుతుందని ఆరు రోజులకి 900 రూపాయలు అవుతుందని పని భారం ఎక్కువ అవుతుందని తక్షణమే పని భారం తగ్గించి రోజుకి 600 రూపాయలు ఇవ్వాలని వికలాంగులకు రోజుకి80 రూపాయలు చొప్పున పడుతుందని ఆరు రోజులకి 400 రూపాయలు అవుతుందని ప్రభుత్వం ఇప్పుడున్న పరిస్థితులను బట్టి రోజుకి 300 రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వం నుండి వికలాంగులకు 50% రాయితీ రావాల్సి ఉందన్నారు.










