
- సిపిఐ మధు
ప్రజాశక్తి-బత్తలపల్లి : శ్రీ సత్యసాయి జిల్లాలో బత్తలపల్లి మండలంలో ఏఐటీయూసీ కార్యాలయంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి మధు విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి, జేవి రమణ వర్కింగ్ ప్రెసిడెంట్, కమతం కాటమయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు కుల్లాయప్ప, సిపిఐ మండల కార్యదర్శి వెంకటేష్, మండల సహాయ కార్యదర్శి, గుండాల ఓబులేష్ , సిపిఐ నాయకులు మాతంగి వెంకటేష్, సత్యప్ప, అంకే నారాయణ, జయమ్మ, ఫక్రుద్దీన్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ బత్తలపల్లి మండలంలో సర్వేనెంబర్ 401లో 19.84 దేవాదాయ భూమున్నది. ఈ భూముల ఆక్రమించడానికి కొంతమంది అక్రమ దారులు అధికారుల చుట్టూ ప్రదర్శనలు చేస్తున్నారు. అదేవిధంగా వంక పోరంబోకు, చుక్కల భూములు ఎక్కడున్నా వాటిపై కన్నేసి దొంగ డాక్యుమెంట్లు సృష్టించి ఆక్రమించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. రెవెన్యూ అలాంటి భూములను గుర్తించి పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదే విధంగా 2018-19 నుండి రాష్ట్ర ప్రభుత్వం రైతుల సొంత భూములను చుక్కల భూములుగా కేటాయించి రైతుల సమస్యల పరిష్కారం కోసం వారి ఇబ్బందుల కొరకు భూముల అమ్ముకోలేని పరిస్థితిలో రైతులు దిక్కుతోచన ప్రజల రైతులు ఉన్నారని కావున రైతుల ఇబ్బందుల అవసరాల కోసం ఉపయోగించుకునే విధంగా వారి భూములను వాళ్ళ భూమి రిజిస్ట్రేషన్ చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.