Apr 10,2023 16:36
  • విఎస్ పురం సచివాలయం సిబ్బందికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.

ప్రజాశక్తి-బుచ్చినాయుడు కండ్రిగ : తిరుపతి జిల్లా బుచ్చినాయుడు కండ్రిగ మండలం కాటూరు గ్రామ రెవెన్యూ విఎస్. పురం దళితులు సుమారు 50 సంవత్సరాల నుంచి. సాగు చేస్తున్న భూములకు పట్టాలు ఇవ్వాలని సిపిఐ బియన్.కండ్రిగ మండల కార్యదర్శి కత్తి ధర్మయ్య వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు తులసి రాజన్ వినతిపత్రం ఇవ్వడం జరిగినది. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ స్థానిక విఎస్.పురం గ్రామంలో సర్వే నెంబర్లు 340, 341 భూములను దళితులు పేదలు సిపిఐ అండతో సుమారు 50 సంవత్సరాలుగా 70 దళితులు కుటుంబాలు ఈ భూమిని నమ్ముకొని సాగు చేసుకుంటున్నారు. అదే గ్రామానికి చెందిన కొంతమంది రాజకీయ పలుకుబడుతూ రెవెన్యూ అధికారుల అండదండలతో బోగస్ పట్టాలు సృష్టించుకుని అనుభవంలో ఉన్న దళిత రైతులను భయంతో గురిచేస్తామన్నారు. ఇప్పటికైనా సాగులో ఉన్న రైతులకు రెవెన్యూ అధికారుల సర్వే చేసి పట్టాలు ఇవ్వాలని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. భూములు స్థానికతరులు అనర్హులు చేతుల్లో ఉన్నాయని ఈ భూములన్నీ పేదలకుపంచడానికి స్థానిక ఎస్సీ ఎస్టీ బీసీ భూమిలేని నిరుపేదలతో కలసి సిపిఐ రాబోయే కాలంలో పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తుందని ఈ సందర్భంగా ఆయన అన్నారు. మండలంలోని ప్రతి గ్రామంలో ప్రతి పేద కుటుంబానికి రెండున్నర ఎకరాల భూమిని ఇవ్వాలని భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్రవ్యాప్తంగా సిపిఐ రాష్ట్ర నాయకులు కోనేరు రంగారావు సిఫారసులు అమలు చేయాలని మండలంలో అసైన్మెంట్ కమిటీలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని  డిమాండ్ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో జగనన్న ఇళ్లకు ఐదు లక్షల రూపాయలు మంజూరు చేయాలి వారు డిమాండ్ చేశారు.