- - ముఖ్య మంత్రి వరదల హామీ నిలబెట్టు కోవాలి
ప్రజాశక్తి:వి ఆర్ పురం: మండలంలోని ప్రచార రణభేరీలో భాగంగా రామవరం గ్రామ పంచయతీలో కోప్పల్లి. శబరి రాయిగూడెం. తెల్లవారి గుంపు మూడు గ్రామంలోనీ ప్రచార బేరి భాగంగా ప్రతి ఇంటికి కరపత్రాలు పంచుతూ సమస్యలు తెలుసుకుంటూ ఉపాధి హామీ కూలీలు పనిచేస్తున్న ప్రదేశాలకు సందర్శించడం జరిగింది. ప్రచార బేరి బృందం ముందు కూలీలు తమ సమస్యలను వెళ్ళబుచ్చారు తదుపరి సిపిఎం మండల నాయకులు వడ్లది రమేష్ మాట్లాడుతూ పోలవరం భూమి ప్యాకేజీ ఇవ్వాలనీ కోరుతూ శబరి రాయిగూడెం వరదలకు వచ్చిన ముఖ్య మంత్రీ ఇచ్చిన హామీ 10వేలు నష్ట పరిహారం అందలేదనీ పోలవరం ముంపులో చేర్చి నష్ట పరిహారం ఇవ్వాలని కోప్పల్లి తెల్లవారి గుంపు గ్రామాల నిర్వాసితులకు 300 ఎకరాల భూమికి నష్టపరిహారం వారు డిమాండ్ చేశారు. తదుపరివారు ఉపాథి హామీ పని ప్రదేశాలను కు రావాల్సిన అలీవెన్స్ మజ్జిగ నీళ్ళు మెడికల్ కిట్టులు టెంట్ ఇవ్వాలనీ గునపం తట్టపారకు కూలీ ఇవ్వాలన్నారు. ఈసందర్భంగా సిపిఎం మండల నాయకులూ వడ్లధి రమేష్ మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వం వచ్చిన తరవాత అటువంటి ఉపాథి పని లాక్అలేవెన్స్ ఆపారని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలూ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నీరు కార్చుతున్నాయని విమర్శించారు. జగనన్న మా భవిషత్ కార్యక్రమములో జగన్ స్టికర్స్ అంటుస్తున్నారే తప్ప ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదనీ అవేదన వ్యక్తం చేసారు. ఈకార్యక్రమంలో నాయకులూ కుంజా నాగిరెడ్డి ఉపాధి కూలీలు ప్రజలు పాల్గొన్నారు.










