- రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మూలం రమేష్
ప్రజాశక్తి - గూడూరు టౌన్ : గూడూరు పట్టణంలోని సి.పి.యం. కార్యాలయంలో బుధవారం కేంద్ర బిజెపి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిరంకుశ విధానాలపై ఏప్రిల్ 14 నుండి 30 వరకు జరిగే ప్రచార బేరి వాల్ పోస్టర్లను సి.పి.ఐ. సి.పి.యం వామపక్షాల పార్టీల నాయకుల ఆధ్వర్యంలో వాల్ పోస్టర్లను ఆవిష్కరించడం జరిగింది. అనంతరం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మూలం రమేష్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మిక హక్కులను కాలరాసే దానికి ప్రయత్నిస్తోందని ఆ విధానానికి స్వస్తి పలకాలని లేకపోతే అడ్డుకుంటామని ఆయన హెచ్చరించడం జరిగింది. దేశంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు సమస్యలను ఏవైతే చెప్పారో అవి తిరోగమనం చేశారని, అందుకే రైతాంగం పెద్ద ఎత్తున ఉద్యమించడం జరిగిందని, అనేక పద్ధతుల్లో సంవత్సరానికి రెండు కోట్లు ఉద్యోగాలు ఇస్తానని చెప్పి, ఈరోజు దేశం మొత్తం మీద కార్పొరేటీకరణ, ప్రైవేటీకరణ, కు శ్రీకారం చుట్టి లక్షలాది మంది కార్మికులను వీధిపాలు చేసిందని, బిజెపి ప్రభుత్వం ఏది చెప్తాదో ఈ రాష్ట్రంలో వై.ఎస్.ఆర్. సిపి అదే అమలు చేసే దానికి సిద్ధమైందని, ఈరోజు వైయస్సార్ ప్రభుత్వం రాష్ట్రంలో చేస్తుంది ప్రధానంగా పట్టణ సంస్కరణలలో భాగంగా ఇంటి పన్నులు, కొళాయి పన్నులు, చెత్త పన్నులు లాంటి సంస్కరణలు, ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందో వాటిని స్పీడుగా ఈ రాష్ట్రం అమలు చేసే దానికి ప్రయత్నిస్తుందని, అదేవిధంగా రైతాంగానికి సంబంధించిన మీటర్లు పెట్టి దివాలా తీంచేందుకు, ఈ రాష్ట్రంలో రైతాంగానికి, బిజెపి చెప్పిన విధానాన్ని ఈ రాష్ట్రం అమలు చేస్తుందని, ఏదైతే ప్రైవేటీకరణలో భాగంగా, విశాఖ ఉక్కు, ఈ రాష్ట్రానికి అనేక మంది త్యాగాలు చేసినటువంటి దాన్ని కేంద్రం ప్రైవేటీకరణ చేస్తున్నట్లు ప్రకటించడం జరిగిందని, ఒక పక్క అమరావతిని అక్కడే కొనసాగే దానికి ప్రకటన చేయడం ఈరోజు మరో మారు చూస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిందని బిజెపి ప్రధానమంత్రి కూడా ఆ రోజు ఆ ప్రారంభానికి వచ్చి ప్రారంభించే దానిలో పాల్గొనడం జరిగిందని, ఆయన తెలియజేశారు. ఈనాడు ఈ మూడు విధానాలను అవలంబించడం వల్ల అమరావతిని అక్కడే కొనసాగించే దానికి ప్రకటన ఈరోజు మరో మారు చేస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న ఉద్యోగ అవకాశాలు ఎక్కువ మందికి వచ్చేటటువంటి ప్రత్యేక హోదా కానీ, విభజనలు కానీ, ఇటువంటివన్నీ కూడా ఆరోజు అంగీకరించి, నేను అధికారంలోకి వస్తే బిజెపి ప్రభుత్వాన్ని తలవంచి తీసుకువస్తానని వైఎస్ఆర్ సిపి, చెప్పడం జరిగిందని, ఈరోజు మోడీకి వంగి సలాం చేస్తున్నటి వంటి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగానూ కేంద్ర ప్రభుత్వం లో బిజెపి విధానాలకి వ్యతిరేకంగానూ, ఏదైతే అదాని, అంబాని లకి పోర్ట్లు, గాని ఏ ఇతర అనేక రకాలైనటువంటివి, ఈ రాష్ట్ర ప్రభుత్వం కట్టబెట్టిందని వీటన్నింటికీ వ్యతిరేకంగా ఈనెల 14వ తేదీ అంబేద్కర్ జయంతి సందర్భంగా "ప్రచార బేరి" ప్రారంభమై 30వ తేదీ వరకు, ఈ రాజకీయ ప్రచారం ఈ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుందని, దేశవ్యాప్తంగా వామపక్షాలు సి.పి.ఐ. సి.పి.యం.లు కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాయని అందువల్ల కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వాన్ని వెనక్కి నెట్టేసి దానికి రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్ సిపి గానీ వీటిని అమలు పరిచేటువంటి, తెలుగుదేశం, జనసేన, రెండు పార్టీలు కూడా బిజెపికి వంగి సలాం చేస్తున్నాయని, ఈ మూడింటికి వ్యతిరేకంగా రాబోయే కాలంలో వామపక్ష పార్టీలు పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకొని పోయి, ఈ విధానాలు వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తారని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సి.పి.యం. రాష్ట్ర కమిటి సభ్యులు నెల్లూరు యాదగిరి, తిరుపతి జిల్లా సి.పి.యం. పార్టీ కార్యదర్శి వందివాసి నాగరాజు, సెంటర్ శాఖ కార్యదర్శి జోగి శివకుమార్, బి.వి.రమణయ్య అడపాల ప్రసాద్, ఎస్.సురేష్, పామంజి మణి, టి.వెంకటరామిరెడ్డి, చంద్రమోహన్ , నరసింహులు, పుట్టా శంకరయ్య, బి.సి.భాస్కర్, బి.చంద్రయ్య,సి.పి.ఐ. నియోజకవర్గ కార్యదర్శి జి. శశి కుమార్, ఎస్కే.కాలేషా, భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.










