
న్యూఢిల్లీ : దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. గడచిన 24 గంటల్లో కొత్తగా 42,982 కరోనా కేసులు నమోదవ్వగా.. మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 3,18,12,114కి చేరిందని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ గురువారం తెలిపింది. ఇక ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసులు 4,11,076 ఉన్నాయి. కరోనాతో బుధవారం ఒక్క రోజే 533 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 4,26,290కి చేరింది. ఇక దేశంలో రికవరీ రేటు 97.37గా ఉంది.
రాష్ట్రాల వారీగా మరణాల సంఖ్యను చూస్తే.. మహారాష్ట్ర 1,33,410, కర్ణాటక 36,680, తమిళనాడు 34,197, ఢిల్లీ 25,058, ఉత్తరప్రదేశ్ 22,767, పశ్చిమబెంగాల్ 18,180, కేరళ 17,211 కరోనా మరణాలు సంభవించాయని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి.