Oct 02,2023 13:50

ప్రజాశక్తి - గిద్దలూరు : ఖైదీలు ప్రతీ ఒక్కరు సత్ప్రవర్తన అలవర్చుకోవాలని అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి బి.మేరీ సారా ధానమ్మ అన్నారు. సోమవారం పట్టణంలోని సబ్ జైలు నందు గాంధీ జయతి సందర్బంగా ఏర్పాటు చేసిన న్యాయ విజ్ఞాన సదస్సులో అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి బి.మేరీ సారా ధానమ్మ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆమె ఖైదీలతో మాట్లాడుతూ న్యాయవాదిని ఏర్పాటు చేసుకోలేని ఖైదీలకు 
ఉచితంగా న్యాయవాదిని ఏర్పాటు చేస్తామని తెలిపారు. తప్పులు చేసి జైలుకు వెళ్లి విలువైన జీవితాన్ని నాశనం చేసుకోవద్దని, అలాగే  జైలు నుండి విడుదలైన తర్వాత సత్ప్రవర్తనతో సమాజంలో కలిసిపోయి ఉన్నత జీవితం గడపాలని అన్నారు. అనంతరం ఖైదీలకు పండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ప్యానల్ న్యాయవాది కె.రవి ప్రకాష్ బాబు, పారా లీగల్ వాలంటీర్ అద్దంకి మధు సూధనరావు, ఇంచార్జి సూపరెండేంట్ పి.రవీంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు. పాల్గొన్నారు.