- కంపెనీలతో వ్యవసాయ అధికారులు కుమ్మకు
- రైతులకు పరిహారం ఇచ్చి ఆదుకోవాలి
- విత్తనాల కంపెనీలపై కేసులు పెట్టాలి : ఏపీ రైతు సంఘం డిమాండ్
- ప్రభుత్వానికి నివేదిక పంపాం : వ్యవసాయ శాఖ జెడి
ప్రజాశక్తి కర్నూలు కలెక్టరేట్ : నకిలీ పత్తి విత్తనాలను సాగు చేసి నష్టపోయిన రైతులు తమను ఆదుకోవాలని కోరుతూ ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్ కార్యాలయాన్ని దిబ్బందించి నిరసన తెలియజేశారు. కలెక్టరేట్ ఎదుట ఎన్టీఆర్ సర్కిల్లో రాస్తారోకో చేపట్టి గంటకు పైగా వాహనాలను నిలిపివేసి రహదారిపై రైతులు బైఠాయించి నిరసన తెలిపారు. వెంటనే మూడో పట్టణ సీఐ తబరేజ్ అక్కడికి చేరుకొని ఏపీ రైతు సంఘం నేతలను సమదావించి వ్యవసాయ శాఖ జీడి వరలక్ష్మికి సమాచారం ఇచ్చారు. వ్యవసాయ శాఖ జెడి కలెక్టరేట్లో నుండి బయటకు వచ్చి రైతు సంఘం నేతలు జి రామకృష్ణ వెంకటేశులు నుండి వినతిపత్రం స్వీకరించారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ జెడి మాట్లాడుతూ వ్యవసాయ శాస్త్రవేత్తలు క్షేత్రస్థాయిలో పంట పొలాలు కూడా పరిశీలించి నివేదిక ఇవ్వడం జరిగిందన్నారు. ఈ నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి కూడా పంపినట్లు తెలిపారు. రైతులను ఆదుకోవాలని ప్రభుత్వానికి నివేదించామన్నారు. జిల్లా కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ,జిల్లాలో ముందటి సంవత్సరం కంటే అధికంగా పత్తి పంట సాగు చేశారన్నారు, దానికి కారణం తక్కువ సాగు చేయడం కు అధిక దిగుబడి రావడంతో ఎక్కువ మంది, రైతులు పత్తి వేసారన్నారు ,పత్తి కంపెనీల యజమానులు, విత్తనాలలో, కల్తీ విత్తనాలను రైతులకు అమ్మారున్నారు. నకిలీ పత్తి విత్తనాలు రైతులకు వచ్చిన వ్యవసాయ శాఖ అధికారులు మాత్రం పట్టించుకోకపోవడం దుర్మార్గమన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు కంపెనీలతో కుమ్మక్క యారన్నారు. కల్తీ పత్తి విత్తనాలు సాగుచేసిన రైతులకు ఎకరాకు రూ 50 వేల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే కల్తీ విత్తనాలను సరఫరా చేసినటువంటి కంపెనీలపై క్రిమినల్ కేసులో నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే ఎక్కడికక్కడ రోడ్లు దిగ్బంధనం చేస్తామని రైతు భరోసా కేంద్రాలు తాసిల్దార్ కార్యాలయాలు దిగ్బంధనం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షుడు కే వెంకటేశ్వర్లు అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఆంజనేయులు కృష్ణ హనుమంతు సూరి, తుగ్గలి శ్రీను ఓర్వకల్లు చంద్రబాబు నాయుడు మధు కర్నూలు మండలం కాండ్రపాడు సర్పంచి బాలపీర హుస్సేన్ అయ్య ఓర్వకల్లు రామకృష్ణారెడ్డి గోకులపాడు మహేశ్వర్ రెడ్డి పర్ల రవి శంకరు ఉల్చాల వెంకటయ్య సుంకన్న వందలాది మంది రైతులు పాల్గొన్నారు.










