Oct 02,2023 13:37

ప్రజాశక్తి-కలక్టరేట్ ( కృష్ణా) : సమగ్ర శిక్ష , కెజిబివి లో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్సోర్నింగ్ పార్ట్ టైం ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని  కోరుతూ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో సోమవారం స్థానిక భాస్కర పురం లోని గాంధీజీ విగ్రహానికి సమస్యలతో కూడిన వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఉద్యోగుల జేఏసీ వైస్ చైర్మన్ సి హెచ్ ఎన్ దేవేంద్ర రావు మాట్లాడుతూ  రాష్ట్ర ప్రభుత్వం కొన్ని శాఖలో ఉద్యోగులను మాత్రమే రెగ్యులర్ చేసి మినిమం ఆఫ్ టైం స్కేల్ అమలు చేసి వేతనాలు పెంచారని  కానీ ఆరు సంవత్సరాలు నుండి సమగ్ర శిక్షా లో పనిచేస్తున్న ఉద్యోగులకు మాత్రం  వేతనాలు పెంచలేదన్నారు. నెలలు తరబడి వేతనాలు పెండింగ్ ఉన్నాయని, ఎం టి ఎస్ కోసం ఇచ్చిన జిఓ లు కూడా అమలు చేయలేదన్నారు. రవాణా చార్జీలు, పని భారం తో ఉద్యోగులు అల్లాడుతున్నరన్నారు .ఈ నేపథ్యంలో గత నెల రోజుల నుండి వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం నుండి స్పందన లేదన్నారు. దీంతో ఉద్యోగులు తీవ్రమైన ఆందోళనగా ఉన్నరన్నారు. ధరలకు అనుగుణంగా వేతనాలు లేకపోవడంతో జీవనం దుర్భరంగా మారిందని అవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే అనేకసార్లు నాలుగున్నర సంవత్సరాల నుండి ప్రభుత్వ పెద్దలకు, మంత్రులకు, అధికారులకు విజ్ఞప్తులు చేసినప్పటికీ స్పందన లేదన్నారు.
ప్రభుత్వానికి స్పందన కలిగి  తమ సమస్యలు పరిష్కరించే ఆలోచన కలిగించాలని గాంధీజీ విగ్రహానికి వినతి పత్రం అందజేయడం జరిగిందన్నారు.  సమగ్ర శిక్షా. కెజిబివి లో పనిచేస్తున్న అన్ని విభాగాల ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, సమాన పనికి సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులందరికీ మినియం ఆఫ్ టైం స్కేల్ - హెచ్ ఆర్ ఏ, డి ఏ అమలు చేసి, వేతనాలు పెంచాలన్నారు.అలాగే ఔట్సోర్సింగ్ సిబ్బందిని కాంట్రాక్టు పద్ధతిలోని మార్చి మినియం ఆఫ్ టైం స్కేల్ అమలు చేసి, వేతనాలు పెంచాలన్నారు. సామజిక భద్రత పధకాలు ఈ పి ఎఫ్, ఇ ఎస్ ఐ లు అమలు చేయాలన్నారు.అలాగే పదవి విరమణ వయస్సు 62 ఏళ్లకు పెంచాలని డిమాండ్ చేశారు. అన్ని పోస్టులకు ఖచ్చితమైన జాబ్ చార్జ్ ఇవ్వాలన్నారు. అలాగే ఖాళీ పోస్టులు భర్తీ చేయక పోవడంతో  ఉన్న ఉద్యోగుల పై పని భారం అధిక మైందన్నారు.రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని సంక్షేమ పధకాలు ఉద్యోగులకు అమలు చేయాలని
డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏ.శేషు బాబు,సుజాత,అశోక్,రామకృష్ణ, సాయి లక్ష్మి తడిరులు పాల్గొన్నారు.