
- తనిఖీ చేసిన ఉపకులపతి ఆచార్య జి జ్ఞానమని
ప్రజాశక్తి-మచిలీపట్నం రూరల్ : కృష్ణా విశ్వవిద్యాలయంలో పలు భవనాల నిర్మాణ పనులు పునః ప్రారంభం అయ్యాయి. వివిధ కారణాల వల్ల గతంలో నిర్మాణ పనులు మధ్యలో ఆగిపోయిన నేపథ్యంలో నూతన ఉపకులపతిగా బాధ్యతలు స్వీకరించిన ఆచార్య జి జ్ఞానమని ప్రత్యేక చొరవతో మళ్ళీ ప్రారంభమయ్యాయి. నిర్మాణ పనులను ఉపకులపతి ఆచార్య జి జ్ఞానమని శుక్రవారం తనిఖీ చేసి పలు సూచనలు చేశారు. నిర్మాణ పనులను ప్రతి రోజు పర్య వెక్షిస్తానని, నూతన నిర్మాణ పనులను ఎప్పటికప్పుడు నీటితో తడపాలని కాంట్రాక్టర్ కు సూచించారు. ఫార్మసీ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్, క్యాంటీన్, బాలుర వసతి గృహం, బాలికల వసతి గృహం, కాంపౌండ్ వాల్, ప్రవేశ ద్వారం పనులు గతంలో అగిన నేపథ్యంలో ఇప్పుడు నిర్మాణ పనులు పునః ప్రారంభం కావడమే కాకుండా ఈ ఏడాది చివరి నాటికి వసతిగృహంలను అందుబాటులోకి తీసుకొచ్చెలా చర్యలు తీసుకున్నట్లు ఉపకులతి ఆచార్య జి జ్ఞానమని తెలిపారు.