Nov 26,2022 15:46

ప్రజాశక్తి-పెదబయలు : డా.బి ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పిస్తున్న అరకు ఎమ్మెల్యే శెట్టి ఫాల్గుణ, మండలంలో బొండాపల్లి పంచాయతీ కేంద్రంలో శనివారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో అరకు ఎమ్మెల్యే శెట్టి ఫాల్గుణ పాల్గొన్నారు. అనంతరం అయన భారత రాజ్యాంగం ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా బాబాసాహెబ్ అంబేద్కర్ చిటపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈకార్యక్రమంలో భాగంగా  రాష్ట్ర వైస్సార్సీపీ కార్యదర్శి జర్సింగి సూర్యనారాయణ స్థానిక సర్పంచ్ బోండా చిట్టీ, ఉపసర్పంచ్ అప్పలరాజు, ఎంపీటీసీ పూర్ణారావు, వైస్సార్సీపీ సీనియర్ నాయకులు గంపరాయి, సూరయ్య, బోండా భాస్కర్, రాజారావు కొండలరావు, వసలంటీర్లు  పాల్గొన్నారు.