Oct 15,2023 09:35
  • పాల్గొన్న పలువురు ప్రముఖులు

ప్రజాశక్తి-రామచంద్రపురం : రామచంద్రపురం మండలంలోని వెంకటాయపాలెం లో గల సేవానంద స్వామి 32 వ వర్ధంతి ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఏ జి పి. పిల్లి మురళీమోహన్, ఏపీ ఐ డి సి డైరెక్టర్ వాసంశెట్టి శ్యామ్, గ్రామ సర్పంచ్ యల్లమిల్లి సతీష్ కుమారి, తాలూకా శెట్టిబలిజ సంఘం నాయకులు రాయుడు చందర్రావు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని సేవానంద స్వామికి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాయుడు చంద్రబాబు మాట్లాడుతూ వెంకటాయపాలెం పరిసర గ్రామాల్లోని ప్రజలకు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించి పలు జిల్లాల్లోని రాష్ట్రం నుండి సేవానంద స్వామి భక్తులు ఎక్కడకు వచ్చి ఆయన అందించే సేవా కార్యక్రమంలో పాల్గొనేవారు అని కులమతాలకు అతీతంగా సేవానంద స్వామి పలువురికి సహాయ సహకారాలు అందించారని కొని ఆడారు. ఆయన సమకాలీను లు మెహర్ బాబా, రమణ మహర్షి తదితరులు ఉన్నారని ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ సభ్యులు షేక్ అహ్మద్, జగన్నాయకులపాలెం ఆర్ బి కే చైర్మన్ సాదే రాజేష్ కుమార్, మాజీ ఎంపిటిసి దళాల రవికుమార్, ఎల్లమెల్లి రవికుమార్, తదితరులు  సేవానంద స్వామి ఆశ్రమంలో జరిగే కార్యక్రమానికి హాజరై నివాళులర్పించారు.