May 29,2023 15:01

ప్రజాశక్తి-తాల్వాయిపాడు : ప్రభుత్వ జీవో ప్రకారం 10% భూమి వదలకుండా ఎలాంటి అనుమతులు లేకుండా 8 ఎకరాల 83 సెంట్లు అమ్మకాలు నిరంతరం కొనసాగిస్తున్నారని తాల్వాయిపాడు గ్రామస్తులు ఎంపీడీవో మరియు ఈవోపీఆర్డీకి ఆర్జీలు ఇచ్చారు. కేంద్ర రాష్ట్రస్థాయి ఉత్తమ పంచాయతీకి న్యాయం జరగట్లేదని, మా గ్రామానికి రావలసిన పది పర్సెంట్ భూమిని ఇప్పించువరకు అమ్మకాలు కొనుగోలు ఆపి మా గ్రామానికి న్యాయం చేయాలని గ్రామస్తులు కోరారు. ఈ సమస్యపై సంబంధిత అధికారులకు ఆర్జీ రూపంలో విన్నవించారు.