Jul 27,2021 10:30

ఢిల్లీ : నర్సాపురం ఎంపి రఘురామ కృష్ణరాజు, టివి 5 ఛైర్మన్‌ బిఆర్‌ నాయుడుపై వైసిపి ఎంపి లు ప్రధాని మోడికి ఫిర్యాదు చేశారు. విజయసాయిరెడ్డి నేతృత్వంలో 15 మంది ఎంపి ల బృందం ప్రధానికి ఫిర్యాదు చేశారు. రఘురామ కృష్ణరాజు, బిఆర్‌ నాయుడి మధ్య హవాలా లావాదేవీలు జరిగాయని, వారిద్దరి మధ్యా మిలియన్‌ యూరోలు బదిలీ అయ్యాయని ఎంపిలు ఆరోపించారు. మనీలాండరింగ్‌, ఫెమా చట్టాల కింద విచారణ చేపట్టాలని ప్రధాని మోడికి విజ్ఞప్తి చేశారు.
      అనంతరం కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ను వైసిపి ఎంపి లు కలిశారు. పొలవరం ప్రాజెక్ట్‌కు 2017-18 ధరల ప్రకారం భూసేకరణ, ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీకి కలిపి రూ.55,656.87 కోట్లకు సిడబ్ల్యుసి, టిఎసి లు ఆమోదం తెలిపాయని గుర్తు చేశారు. పోలవరం, ప్రత్యేక హోదాపై వెంటనే జోక్యం చేసుకోవాలని కోరారు. పోలవరం తుది డిపిఆర్‌కు ఆమోదం తెలపాలని ఎంపి లు విజ్ఞప్తి చేశారు.