Sep 19,2023 14:47

ప్రజాశక్తి - పుత్తూరు టౌన్ : పట్టణంలోని స్థానిక మున్సిపాలిటీ పరిధిలోని ఎనిమిదవ వార్డు గేటు పుత్తూరు నందుగల తుడా నిధులు రూ 34.00 లక్షలతో కమ్యూనిటీ భవనము నూతనంగా నిర్మాణం చేసేందుకు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక వ్యవహారాల, యువజన సర్వీసుల మరియు క్రీడ శాఖ మంత్రి  ఆర్.కె రోజా మరియు భర్త ఆర్కె సెల్వామణితో మంగళవారం పుత్తూరు మున్సిపాలిట నిధుల ద్వారా మంజూరైన నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హల్ (సింగిందర్ కమ్యూనిటీ హాల్) నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజా ప్రతినిధులు ప్రజలు మంత్రి దంపతులను మరియు సోదరులు రాంప్రసాద్ రెడ్డిని ఘన స్వాగతం పలికి ఆహ్వానించారు. అక్కడే శ్రీశ్రీశ్రీ గోవిందమ్మ టెంపుల్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ కమిటీ సభ్యులు పూజారులు వేదమంత్రాలతో మంత్రి దంపతులను మరియు సోదరులు రాంప్రసాద్ రెడ్డి గారిని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో పుత్తూరు మున్సిపాలిటీ చైర్మన్ ఎం హరి వైస్ చైర్మన్లు. డి శంకర్. డి జయప్రకాష్, కమిషనర్ కె ఎల్ ఎం ఎన్ రెడ్డి. డిఈలు కౌన్సిలర్లు కేడి పవన్ కుమార్. ఏకాంబరం, నరసింహారావు, బోర్ డైరెక్టర్లు సభ్యులు ఆలయ చైర్మన్లు ప్రజాప్రతినిధులు వైఎస్ఆర్సిపి ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.