Apr 03,2023 16:09

ప్రజాశక్తి-చింతూరు : అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండల కేంద్రంలోని మసీద్ యాసీన్ లో ఆదివారం చింతూరు మండల అయ్యప్ప యూత్ వారు ముస్లిం సహోదరులకు రంజాన్ పండుగ సందర్భంగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసి మతసామరస్యాన్ని చాటుకున్నారు. 30 రోజుల కఠిన ఉపవాస దీక్ష చేపట్టిన ముస్లింలకు రోజా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసి స్వయంగా వడ్డించడం జరిగింది. గతంలో అయ్యప్ప స్వామి భక్తులకు ముస్లిం యూత్ సభ్యులు అయ్యప్ప స్వామి మాల ధారణ భక్తులకు ఏర్పాటు చేసి మతసామరస్యాన్ని చాటు కొనడం జరిగింది. కుల మతాలు వేరైనా మనమంతా ఒక్కటే నోయి.. భాషలు వేరైనా భావం ఒకటేనని అందరి దైవం ఒకటే అంటూ సోదరభావం చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో ఈశ్వరా చారి, మణి, రాజు, హరి, అయ్యప్ప, గణేష్, ప్రదీప్, తదితరులు పాల్గొన్నారు.