ప్రజాశక్తి-అల్లూరి : పెదబయలు మండలం సోమవారం వారపు సంతలో గిరిజన సంఘం ఆధ్వర్యంలో కాపీ రైతుల బకాయిలు వెంటనే చెల్లించాలని ప్రచార కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఏజెన్సీ కాపీ రైతు జీవితం నీలి నీడలు కమ్ముకున్నాయి. కాపీపై ఆధారపడి జీవిస్తున్న రైతులకు రైతు భరోసా కల్పించలేకపోతున్నారు. ఒకపక్క దళారుల దోపిడీకి గురి అవుతుంటే మరోపక్క కాపీ ప్రాజెక్టును 2018 నుండి 2020 వరకు జాతీయ ఉపాధి హామీ పేరుతో మరియు 2020 నుండి 2022 వరకు ఐటీడీఏ కాపీ ప్రాజెక్టు పేరుతో ప్రోత్సహకాలు అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. 2018 నుండి 2020 వరకు మూడు సంవత్సరాలుగాను ఉపాధి హామీ పథకం ద్వారా 32 వేలల రూపాయలు చెల్లించవలసి ఉండగా కేవలం 12,500 మాత్రమే చెల్లించి మిగిలిన 19500 నేటికీ చెల్లించలేదు 2020లో ఉపాధి హామీ పథకంలో కాపీ ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. 202022 నుండి ఐటీడీయ ద్వారా కాపీ ప్రాజెక్టును కొనసాగిస్తున్నారు. మూడు సంవత్సరాల కురకు రైతులకు చెల్లించాల్సిన ప్రోత్సహక నిధులు కేవలం రెండు సంవత్సరాలకే కుదిరి చేశారు. ఒక్క ఎకరాకు 8500 చొప్పున చెల్లించవలసి ఉండగా ఐటీడీఏ నేటికీ కనీసం చెల్లించకుండా రైతులకు అన్యాయం చేస్తుంది. రైతులకు చెల్లించవలసిన బకాయిలపై ఫిబ్రవరి 17 తేదీన పాడేరు ఐక్టీరియా వద్ద ఉదయం 11 గంటలకు నిర్వహించే కాపీ రైతు గోష ధర్నాను జయప్రదం చేయాలని గిరిజన కాపీ రైతు సంఘం గిరిజన సంఘం ఉమ్మడిగా పిలుపునివ్వటం జరిగింది. ఈ కార్యక్రమానికి కాపీ రైతులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని గిరిజన సంఘం మాజీ జిల్లా అధ్యక్షులు బొండా సన్నిబాబు కే సర్బన్న నీలకంఠం తదితరులు సొంత ప్రచార కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది










