
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కాన్వాయ్ వెళ్తున్న సమయంలో తుళ్లూరు మండలం మందడం శిబిరం వద్ద రైతులను అడ్డుకుంటున్న పోలీసులు
ప్రజాశక్తి, తుళ్లూరు (గుంటూరు) : కేబినెట్ సమావేశానికి హాజరయ్యేందుకు సచివాలయానికి శుక్రవారం వెళ్తున్న ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డికి రాజధాని రైతులు నిరసన తెలిపారు. సిఎం వెళ్తున్న మార్గంలో తుళ్లూరు మండలం మందడంలో రహదారి పక్కన నిర్వహిస్తోన్న దీక్షా శిబిరం నుంచి రైతులు, మహిళలు నిరసన తెలిపేందుకు రోడ్డుపైకి వస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. సిఎం కాన్వారు వెళ్లేంత వరకూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాజధాని రైతులు నినాదాలు చేస్తూనే ఉన్నారు.

