Dec 16,2022 16:31

ప్రజాశక్తి-రాంబిల్లి : ఈనెల 18న పరవాడలో జరిగే సిఐటియు మహాసభ బహిరంగ సభను కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయండి. ఈరోజు రాంబిల్లి మండలంలో, వై లోవ, పెదకలువలపల్లి, వెల్చూరు, సంతపాలెం, లాలంకోడూరు, లోపాలం వెంకయ్య పాలెం, రాంబిల్లి కేజీ పాలెం, గ్రామాల్లో పర్యటించి సిఐటియు నాయకులు జీదేమున్నాయుడు మాట్లాడుతూ, ఆదివారం 18న ఉదయం 10 గంటలకు పరవాడలో సిఐటియు మహాసభలు సందర్భంగా భారీ ప్రదర్శన బహిరంగ సభ జరుగుతుంది. యొక్క బహిరంగ సభలో కార్మిక వర్గం అధిక సంఖ్యలో పాల్గొని  విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. అనకాపల్లి జిల్లా పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుంది. ఫార్మా ఎస్సి జెడ్ పరిశ్రమల్లో, వేలాది మంది కార్మికుల పనిచేస్తున్నారు. పరిశ్రమల్లో కార్మికులకు భద్రత లేకుండా ఉందని, ధరలు నిరంతరం పెరుగుతున్నాయి, కార్మికులకు మాత్రం కనీస వేతనాలు కూడా పెంచలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పరిశ్రమల్లో తరచూ ప్రమాదాలతో కార్మికుల ప్రాణాలు కోల్పోతున్నారు అన్నారు. కార్మికుల ప్రాణాలకు భద్రత కరువైందన్నారు. స్కీం వర్కర్లకు ఉద్యోగ భద్రత లేదు, పని భారం రాజకీయ వేధింపులతో స్కీం వర్కర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. అసంఘటిత రంగ కార్మికులు లక్షల సంఖ్యలో ఉన్న  వారికి ఎటువంటి చట్టాలు లేక వారి సంక్షేమం కోసం ఏ ప్రభుత్వాలు ఆలోచించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని, నిరంతరం సిఐటియు రాజీలేని పోరాటం చేస్తుందన్నారు. ఈ మహాసభల్లో కార్మిక సమస్యలపై చర్చించి రాబోయే కాలంలో పెద్ద ఎత్తున కార్మిక సమస్యలపై పోరాటాలు నిర్వహిస్తామన్నారు. ఈ బహిరంగ సభలో వేలాది మంది కార్మికుల పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు.