Jun 05,2023 15:43
  • డైలీ వేజ్ వర్కర్లను రెగ్యులర్ చేయాలని పిఓకు వినతి...

ప్రజాశక్తి-పాడేరు : తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గిరిజన సంక్షేమ వసతి గృహాల వర్కర్లు సోమవారం ఐటీడీఏ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా హాస్టల్ వర్కర్లు తమ సమస్యలపై నినాదాలు చేశారు. ఈ మేరకు డైలీ వేజ్ కార్మికులను రెగ్యులర్ చేయాలని అవుట్సోర్సింగ్ కార్మికులను సీనియారిటీ ప్రాతిపదికన రెగ్యులర్ చేయాలని హాస్టల్ వర్కర్లకు మినహాయింపు ఇవ్వాలని ప్రభుత్వ సెలవులు మంజూరు చేయాలని వసతి గృహాల్లో ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని కార్మికులపై పని ఒత్తిడి తగ్గించాలని హాస్టల్ వర్కర్లకు 8  గంటల పని దినం అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ ధర్నాను ఉద్దేశించి సీఐటీయూ అల్లూరి జిల్లా ప్రధాన కార్యదర్శి ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా ఐటీడీఏ పరిధిలోని గిరిజన సంక్షేమ వసతి గృహాల్లో  రోజుకి 50 రూపాయల వేతనంపై ఇన్నేళ్లుగా పనిచేస్తున్న కార్మికులు సమస్యలు పరిష్కారం పై అధికారులు తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు. హాస్టల్స్ లో పని చేస్తూ కొంతమంది వర్కర్లు మృతి చెందారని, అధికారులు మానవతా దృక్పథంతో ఆలోచించి వారి కుటుంబాలకు ఉపాధి కల్పించి ఆదుకోవాలని కోరారు. అనంతరం ఐటిడిఏ ప్రాజెక్టు అధికారికి హాస్టల్ వర్కర్ల సమస్యలపై వినతి పత్రం అందజేశారు.

  •   వేతనం బకాయిలు చెల్లించండి : సిఐటియు డిమాండ్

ఈ ధర్నా నుద్దేశించి  సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వి. ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ హాస్టల్ కార్మికులు సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని కార్మికులచేత వెట్టిచాకిరి చేయిస్తున్నారని తెలిపారు. సంక్షేమ హాస్టల్లో చట్ట ప్రకారం ఎనిమిది గంటల పని దినం అమలు కావడం లేదని రోజుకి 18 నుండి 20 గంటలు పని చేస్తున్నారని మానవ హక్కుల ఉల్లంఘన అని తెలిపారు. పిల్లలు ఎక్కువ కార్మికులు తక్కువగా ఉంటున్నారని పని భారం పెరుగుతున్న కాళీ పోస్టులు భర్తీ చేయడం లేదని తెలిపారు. డ్యూటీలో చనిపోయిన కార్మికుల కుటుంబాలకి మానవత దృక్పథంతో అధికారులు ఆదుకోవాలని ఉపాధి కల్పించాలని విజ్ఞప్తి చేశారు. రెండు నెలలుగా జీతాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. అధికారులను కోరారు. డైలీ వేజ్ కార్మికులకు పీఎఫ్ సౌకర్యం కల్పించాలని, సీనియార్టీ ప్రకారం  రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. జూనియర్ కాలేజీల్లో పని చేస్తున్న కార్మికులకు నెలకు 3500 వేతనం ఇవ్వడం దుర్మార్గమని ఆ కుటుంబాలు ఎలా బ్రతుకుతాయని అధికారులు ప్రశ్నించారు. తక్షణం డిమాండ్లు పరిష్కారం చేయాలని అన్నారు.  ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ హాస్టల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు బాలన్న, సోంబాబు తదితరులు పాల్గొన్నారు.