Jul 16,2023 16:46
  • నూతన కార్యవర్గం ఎన్నిక...

ప్రజాశక్తి-సూళ్లూరుపేట(తిరుపతి) : సూళ్లూరుపేట సిఐటియు మండలి మహా సభ ఆదివారం స్థానిక రోటరీ క్లబ్బులో సిఐటియు మండలం మహాసభ ఘనంగా జరిగింది. ఈ సభకు సిఐటియు అధ్యక్షులు ఎస్.సాంబశివయ్య అధ్యక్షత వహించారు. సభకు విచ్చేసిన ప్రత్యేక ఆహ్వానితులు తిరుపతి జిల్లా సిఐటియు ఉపాధ్యక్షులు  పుల్లయ్య ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో సూళ్ళూరుపేట పారిశ్రామికంగా మంచి గుర్తింపు వుందని కార్మికులు వేతనాలు, సంక్షేమము రక్షణ కొరకు నిరంతరము అండదండగా  ఉంటామన్నారు.సిఐటియు కార్యదర్శి సిహెచ్.సుధాకర్ రావు 4 సంవత్సరాల కార్యక్రమాల నివేదికను సభలో ప్రవేశ పెట్టారు.మూడు సంవత్సరాలకు గాను నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులుగా ఎస్.సాంబశివయ్య, అధ్యక్షులుగా రమణయ్య, కార్యదర్శిగా లక్ష్మయ్య, కోశాధికారిగా పద్మనాభయ్య, తదితర 18 మంది కమిటి మెంబర్లుగా ఎన్నుకున్నారు. జిల్లా నాయకులు సుంకర అల్లెయ్య కొత్త కమిటీకి తమ అభినందనలు తెలియజేస్తూ తన సహకారము ఎల్లవేళలా వుంటుందన్నారు. సభకు పి.మనోహరం వందని సమర్పణ చేసారు.