ప్రజాశక్తి-పుత్తూరు టౌన్ : పుత్తూరు పట్టణం మండి వీధిలోని సెయింట్ జాన్ లూథరన్ చర్చిలో ఆదివారం క్రిస్మస్ వేడుకల్లో మంత్రి రోజా ఆమె సోదరుడు రాంప్రసాద్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. సెయింట్ జాన్ లూథెరన్ చర్చ్ చైర్మన్, సభ్యులు మరియు చర్చి ఫాదర్ తదితరులు ఇరువురికి పుష్ప గుచ్చాలతో ఘన స్వాగతం పలికారు. ఏసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకొని మంత్రి ఆర్.కె.రోజా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఏసుక్రీస్తు పుట్టినరోజు సందర్భంగా చర్చిల్లో కేకులు కట్ చేసి. క్రైస్తవ సోదరులకు సోదరీలకు శుభాకాంక్షలు తెలియజేసి ఆనందంగా కేకును అందరికీ ఇవ్వడం జరిగింది అనంతరం పేదలకు వస్త్ర దానం చేశారు. చర్చి యొక్క క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఏసుక్రీస్తు దేవుని మహిమతో అందరూ సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. అన్ని మతాలవారు ఐకమత్యంగా ఉండాలని ఆ దేవుని ఆశీర్వాదంతో చల్లగా ఉండాలని తెలిపారు. అనంతరం చర్చి పాస్టర్ మంత్రి ఆర్ కే రోజా ను ఆశీర్వాదించారు. ఈ కార్యక్రమంలో పుత్తూరు మునిసిపల్ చైర్మన్ ఆనంగి గెడ్డం హరి, వైఎస్ఆర్సిపినాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.










