Jun 10,2023 22:42
  • కానరాని కుటుంబాలకు భరోసా కల్పించిన చంద్రన‌్న భీమా
  • మహిళలకు భీమా చేయించలేని ప్రభుత్వం
  • ఎన్నికలు సమీపస్తుండటంతో హడావుడి

ప్రజాశక్తి-తిరుపతి : రామచంద్రాపురం మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మహిళలకు ఆర్థిక స్వాలంబన పెంచడానికి అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెలుగు సంఘాలను ప్రారంభించారని ప్రతి మహిళ నెల కొంత పొదుపు చేస్తే వారికి అతి తక్కువ వడ్డీతో బ్యాంకు లింకేజీ రుణాలు ఇప్పించి పిల్లలను మంచి చదువులు చదివించుకోవటం, పాడి పశువులు పట్టుకొని స్వయం ఉపాధి పొందటం చేస్తూ వస్తున్నారని పొదుపు సంఘాల మహిళలకు బీమా కల్పించడానికి అప్పటి ప్రభుత్వం చొరవ తీసుకొని చంద్రన్న బీమా తామే చెల్లిస్తూ భరోసా కల్పించిందని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి చినబాబు తెలిపారు. పొదుపు సంఘాల పైన భారం పడకుండా బీమా పథకాన్ని వర్తింప చేస్తూ వచ్చిందని,2019 లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం చంద్రన్న బీమాను పక్కన పెట్టి, ముద్దుగా వైఎస్ఆర్ బీమా గా నామకరణం చేసి  ప్రభుత్వం ఎలాంటి బీమా కల్పించడానికి చొరవ తీసుకోలేదని, మహిళా సంఘాలకు అమ్మ పెట్టదు అడుక్క తిన్నివ్వదు అన్న పరిస్థితి దాపురించింది ప్రభుత్వం పై దుయ్యబట్టారు. భీమాను గురించి మహిళలు గత నాలుగు సంవత్సరాల నుంచి ఆందోళన చెందుతూనే ఉన్నారని, అనుకోని సంఘటనలతో మృతి చెందిన వారికి ఎలాంటి బీమా వర్తింపచేయలేక ప్రభుత్వం చేతులెత్తేసిందన్నారు.ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో మరొకసారి వైసిపి మహిళల్ని మోసగించడానికి తన జిత్తులమారి తనాన‌్ని ప్రదర్శించడానికి పూనుకున్నదని, మహిళా సంఘాలకు ఆసరా పేరుతో  రెండో  విడత అందించిన సొమ్ములోనే మహిళల ఖాతా నుంచి ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకం కింద అమలు చేయటానికి ఆగమేఘాల మీద ఆజ్ఞలు జారీ చేసి  యాబై సంవత్సరాల లోపు మహిళలకు 456 రూపాయలు, యాబై నుంచి డెబ్బై  సంవత్సరాల లోపు వారికి 436 రూపాయలు మహిళా సంఘాల ఖాతాల నుంచి జమ చేసుకోవడానికి బ్యాంక్ వారికి ప్రభుత్వం అనుమతినిచ్చింది. గతంలో ప్రభుత్వమే చెల్లించే బీమా నేడు మహిళల ఖాతా నుంచి తీసుకోవటమేమిటని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  ఇదేనా ప్రభుత్వం మహిళల పట్ల చూపే ఆదరణ అంటూ ఎద్దేవా చేశారు. ఎన్నికల వచ్చేలోపు ఇంకెన్ని జిమ్మిక్కులకు వైసీపీ తెర తీస్తుందో ప్రజలు అప్రమత్తంగా గమనించాలని, మహిళల పైన వైసిపి చూపే కరుణ అంటే కానే కాదు ఇది కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చూపుతున్న కపట ప్రేమ అని అందరికీ అర్థమైందని చిత్తూరు పార్లమెంటరీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి చినబాబు తెలిపారు.