Nov 14,2022 16:43

ప్రజాశక్తి - రంపచోడవరం : రంపచోడవరం మండలం ముసురిమిల్లి పంచాయతీ చిన్న భారంగి మేరీ ఏయిడ్ ప్రైమరీ స్కూల్ బాలల దినోత్సవ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు వంశి కుంజం పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా నెహ్రు చిత్ర పటానికి పులమాల వేసి మాట్లాడుతు పిల్లలందరికి శుభాకాంక్షలు తెలియజేసి విద్య ఎంత అయితే నేర్చుకుంటామో అంత ఉన్నత స్థాయి వెళ్ళతమని విద్యతో పాటు ఆట పాటలలో కూడా రానివాళ్ళని చెప్పడం జరిగింది. అనంతరం ఆటలలో జరిగిన వారికి బహుమతులు అందజేసి పిల్లలకు లెక్కలు, ఎక్కలు, నృత్యం పోటీలు పెట్టి వారికి బహుమతులు ఇచ్చి చాక్లెట్లు ఇవ్వడం జరిగింది పిల్లలతో కలిసి భోజనం చేసి ప్రతి రోజు భోజనాలు మెనూ ప్రకారం పెడుతున్నారా, ఎలా ఉంది అడిగి తీసుకోవడం జరిగింది. ఈ కార్యాలయంలో సర్పంచ్ కోసు రమేష్ బాబు దొర, వార్డ్ మెంబెర్ సత్యవతి, వైస్సార్సీపీ నాయకులు రాజన్న దొరా, బోబ్బా శేఖర్, స్కూల్ విద్య కమిటీ చైర్మన్ ముర్ల పద్మావతి, సూర్య చంద్ర భాస్కర టార్జాన్, హెడ్ మాస్టర్ విశ్వరాజ్ తదితరులు పాల్గొన్నారు