ప్రజాశక్తి-పెదబయలు : అల్లూరి జిల్లాలో చిన్నారుల మృతి పట్ల విషాదం నెలకొంది. ఆరు నెలల్లో 15 మంది వివిధ కారణాలతో మృతి విద్యార్థిలా మృత్తుల పట్ల నిమ్మకు నిరీతినట్లు ప్రభుత్వ యంత్రాంగం నామ మాత్రపు చర్యలు లేవంటున్నారు. అల్లూరి జిల్లా గిరిజన సంఘం, వివరాల్లోకి వెళితే పెదబయలు గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నంత పాస్టశాలలో 5వ తరగతి పూర్తి చేసిన అంబిరి లావణ్య (11) వేసవి సెల్లవులకు ముందు నుండే రక్తహీనతో బాధపడుతూ శనివారం విశాఖపట్నం కెజిహెచ్ హాస్పిటల్ లో సారి అయినా చికిత్స అందకపోవడంతో మృతి చెందినట్లు మృతురాలు తల్లిదండ్రులు అంబిరి కృష్ణారావు, కృష్ణవేణిలు గలగండ పంచాయతీ శిరీష పల్లి గ్రామంలో తెలిపారు. విషయం తెలుసుకొన్న స్థానిక పాత్రికేయులు గిరిజన సంఘం పూర్వపు అధ్యక్షుడు బొండా సన్నీ బాబు అల్లూరి జిల్లా గిరిజన సంఘం ప్రధాన కార్యదర్శి కొమ్మ పృథ్వి రాజ్ శిరీషపల్లి గ్రామంలో వెళ్లి శోకసముద్రంలో ఉన్న బాధిత కుటుంబసభ్యులను ఓదార్చి పరామర్శించారు. అనంతరం విద్యార్థిని మృతికి కారణాలు అడిగి తెలుసుకొన్నారు, అనంతరం సంయుతంగా గిరిజన సంఘం నాయకులు మాట్లాడుతూ వేసవి సెలవుల కన్నా ముందు నుండే విద్యార్థిని ఆరోగ్యం రక్త హీనత 0.5 బాధపడుతున్న కనీసం సమీపంలో గల ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో విద్యార్థిని చికిత్స చేపించలేదని అక్కడే ఉన్న ప్రధాన ఉపాధ్యాయుడు చెట్టి నారాయనను నిలదీశారు పది నుండి పదిహేను సార్లు ఫోన్ చేసిన ఎందుకు రెస్పాండ్ కాలేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తo చేశారు. డిప్యూటీ వార్డెన్ భాగ్య వతి ఫోన్ అసలు లిఫ్ట్ చేయడం లేదన్నారు. ఆశ్రమ పాఠశాలలో 28 నుండి వేసవి సెలవులలో వార్షిక పరీక్షలు జరుగుతున్న సమయములో విద్యార్థికి చికిత్స అందించాలని తల్లిదండ్రులు కోరిన పట్టించుకోకుండా పరీక్ష లకే ప్రాధాన్యత ఇచ్చారు. తప్ప విద్యార్థిని అనారోగ్యం పట్ల శ్రద్ద కనబరాచలేదన్నారు. హెచ్ ఎం వార్డెన్లు మి పిల్లలైతే ఇట్లనే శ్రద్ద కనబరుస్తారా? అని ప్రశ్నించారు. గతంలో ఆశ్రమ వసతి గృహల్లో వివిధ కారణాలతో 14 మంది రూడకోటలో అంతు చిక్కని వ్యాధులతో, 20 మంది చిన్నారులు మృతి చెందిన ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదన్నారు. అంబిరి లావణ్య వార్షిక పరీక్ష రాస్తూనే అనారోగ్యంతో ఉందని ప్రధాన ఉపాధ్యాయులు హాస్టల్ వార్డెన్ సరి అయినా సమయంలో స్పందించి ఉంటే విద్యార్థిని బ్రతికి ఉండేదని అన్నారు. విద్యార్థిని మృతిపట్ల ఉన్నత స్థాయి అధికారులు సమగ్రమైన ధర్యాప్తు జరిపి శాఖ పరమైన చర్యలు తీసుకోకపోతే ప్రజా సంఘాలతో పోరాటం ఉదృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం పాడేరు ఐ టి డి ఎ ప్రాజెక్ట్ అధికారి అభిషేక్ ని చరవాణి ద్వారా గిరిజన సంఘం పూర్వపు అధ్యక్షులు బొండా సన్నిబాబు జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్మ పృద్విరాజ్ వివరాలను తెలిపారు. అనంతరం సిరిసపల్లి గ్రామస్థులు బంధువులతో కలసి గంటసేపు ఆందోళన చేశారు బాద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో గలగండ సర్పంచి లోహితసు మాజీ సర్పంచ్ లక్ష్మణ్ ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.










