Aug 07,2021 09:53

పెరంబూర్‌ (చెన్నై) : నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఈనెల 10 వ తేది వరకు తమిళనాడులోని 5 జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని చైన్నై వాతావరణ పరిశోధన కేంద్రం తెలిపింది. నీలగిరి, కోయంబత్తూర్‌, తేని, దిండుగల్‌, సేలం జిల్లాల్లోని ఒకటి, రెండు ప్రాంతాల్లోనూ, తిరుప్పూర్‌, తెన్‌కాశి, అంతర్‌ జిల్లాలు, పుదువై, కారైక్కాల్‌, సముద్రతీర జిల్లాల్లో ఒకటి, రెండు ప్రాంతాల్లోనూ ఉరుములతో కూడిన మోస్తరు వర్షం కురిసే అవకాశముందని చెప్పారు. చెన్నైలో ఆకాశం మేఘావృతంగా ఉంటూ సాయంత్రం, రాత్రి వేళల్లో కొన్ని ప్రాంతాల్లో స్వల్పంగా వర్షం కురిసే అవకాశముందని తెలిపారు. గరిష్టంగా 37 డిగ్రీలు, కనిష్టంగా 27 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని వాతావరణ కేంద్రం పేర్కొంది.