Feb 24,2023 16:24

ప్రజాశక్తి వాకాడు:  మండలంలోని జెమిని కొత్తపాలెం పంచాయతీ పరిధిలోని గంగన పాలెం గ్రామానికి చెందిన  దుంపల సుమలత వైయస్సార్ క్రాంతి పథం లో వివో ఏ గా పని చేస్తూ తన భర్తతో కలిసి 12.41 లక్షల  రూపాయలు దోపిడీ చేశారని పొదుపు సభ్యుల నుంచి గురువారం వచ్చినటువంటి ఫిర్యాదుల మేరకు శుక్రవారం ఏపీ డి ప్రభావతి విచారించారు. ఈ సందర్భంగా ప్రభావతి గంగన్న పాలెం వాలిమేడు, నిడుగుర్తి గ్రామాలకు సంబంధించిన సీసీలను అనేక అనుమానాలపై విచారించారు. ఈ సందర్భంగా ప్రభావతి మాట్లాడుతూ  సీసీలు వివోఎల విధులపై పర్యవేక్షణ సక్రమంగా నిర్వహించినట్లైతే పొదుపు నిధులు దుర్వినియోగం కాకుండా ఉంటాయన్నారు అదేవిధంగా గంగన పాలెం కు చెందిన దుంపల సుమలత నుంచి 12.41 లక్షల రూపాయలు మార్చి 14 తారీకు లోపు మొత్తం నగదును రికవరీ చేయాలని సూచించారు లేని పక్షంలో వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని తెలియజేశారు. వారితోపాటు ఎల్ హెచ్. డి. పి.ఎం. ఆదినారాయణ. డిపిఎం విజయకుమార్ ఏపీఎం వెంకట్రావు తదితరులు ఉన్నారు.