Mar 25,2023 23:42

ప్రజాశక్తి - భవానీపురం :

కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఏపిల్‌ 5వ తేదీన తలపెట్టిన ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సిఐటియు ఎన్‌టిఆర్‌ జిల్లా అధ్యక్షులు ఎ. వెంకటేశ్వరరావు కార్మికులకు పిలుపునిచ్చారు. శనివారం భవానీపురం చర్చి సెంటర్‌ వద కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకించాలని కోరుతూ ఏప్రిల్‌ 5వ తేదీ ఛలో ఢిల్లీ కార్యక్రమం విజయవంతం చేయాలని కోరుతూ సిఐటియు పశ్చిమ సిటీ ఆధ్వర్యంలో కరపత్రాలు పంపిణీ చేస్తూ ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు పశ్చిమ సిటీ కార్యదర్శి ఇ.వి. నారాయణ, సిఐటియు పశ్చిమ సిటీ అధ్యక్షులు వెంకట్రావు (చౌదరి), నాయకులు ఎస్‌. సుబ్బారెడ్డి, సి.హెచ్‌. దాసు, బాజీ, శ్రీను, ఆటో వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు పి. వెంకటేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.