ఎరుపు గుండె ఛిద్రమై లావా విరజిమ్మితే
గొంతుక నుండి కిందకి సెలయేళ్లు ఆకుపచ్చవి !
మౌనం అంటే- ఆలోచనలను సీజ్ చేసి,
మాటలను చంపి ఆనవాళ్లు లేకుండా
పూడ్చేయడం కాదు !
కడుపులో కార్చిచ్చు కాలువలు అనేకం..
మెలి తిరిగి విస్ఫోటనానికి సిద్ధంగా ఉన్నవి !
దేహం గురించి స్ఫురణకొస్తే..
నిజంగా అహం అవివేకం అన్నవి ఒక
మూర్ఖపు చర్యలే..!
అబ్బా... అవే విషాద చిత్రాల్ని గీయిస్తాయి..!!
మనిషిని నిలువునా రెండు పచ్చలు చేస్తే-
జీవశాస్త్రం ఫలానా అధ్యాయం..!
ఏమైనా... బ్రతికున్నప్పుడే విర్రవీగుతనం
ఆ తరువాత అయ్యో పాపం అంతా
హతాశులమే..!!
మరి మరణించి కూడా బతికుంటారే కొందరు
మన గుండెల్లో మన నాలుకల్లో ఎప్పుడూ..!!!
రఘు వగ్గు
79782 45215