ఛాయాచిత్ర ప్రదర్శన ప్రారంభించిన కలెక్టర్
తిరుపతి (మంగళం): పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా (పిఆర్‌ఎస్‌ఐ) తిరుపతి చాప్టర్, సంస్కార్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో తిరుపతి బస్టాండు వద్దనున్న గాంధీ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శనను జిల్లా కలెక్టర్ వెంకటరమణ రెడ్డి ప్రారంభించారు. టిటిడి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, నగర పాలక సంస్థ కమిషనర్ హరిత ప్రదర్శనను ఆసక్తిగా పరిశీలించారు. ఇందులో గాంధీజీ బాల్యం, విద్యాభ్యాసం, కుటుంబ వివరాలు, దక్షిణాఫ్రికా విషయాలు, స్వాతంత్య్రోద్యమ ఘట్టాలు తదితర ఛాయాచిత్రాలు ఆసక్తికరంగా ఉన్నాయని పిఆర్‌ఎస్‌ఐ తిరుపతి చాప్టర్ ఛైర్మన్ కె.శ్రీనివాసరావును అభినందించారు. సంస్కార్ ఫౌండేషన్ ఛైర్మన్ రాజేష్, పిఆర్‌ఎస్‌ఐ తిరుపతి చాప్టర్ కార్యదర్శి డి.చంద్రమోహన్, వైస్ చైర్మన్ చంద్రమోహన్ రావు, మాజీ చైర్మన్ డాక్టర్ స్వరాజ్యలక్ష్మి, నేషనల్ కౌన్సిల్ మెంబర్ హర్షవర్ధన్ రెడ్డి, సభ్యులు వివి.సుబ్రహ్మణ్యం తదితరులు ఉన్నారు.










