Jun 30,2023 21:14

ఛార్జీలు తగ్గించకపోతే మరో విద్యుత్‌ ఉద్యమం తప్పదు

వామపక్షాల ఆధ్వర్యంలో సబ్‌స్టేషన్ల వద్ద ధర్నా
 రాయచోటి టౌన్‌ :రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్‌ ఛార్జీలను పెంచి ప్రజలపై పెనుభారం మోపుతోందని, వెంటనే ఛార్జీలు తగ్గిం చకపోతే మరో విద్యుత్‌ ఉద్యమం తప్పదని వామపక్ష నాయకులు హెచ్చరించారు. వామపనక్ష పార్టీల పిలుపు మేరకు శుక్రవారం రాయచోటి-పీలేరు రోడ్డు వద్దనున్న సబ్‌స్టేషన్‌ వద్ద వామ పక్షాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భగా సిపిఎం జిల్లా కమిటీ నాయ కులు రామాంజులు, సిపిఐ జిల్లా కార్యదర్శి పి.ఎల్‌. నరసింహులు, సిపిఐ రాయచోటి నియోజకవర్గ కార్యదర్శి సిద్దిగాళ్ల శ్రీని వాసులు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు విద్యుత్‌ఛార్జీల భారం సామా న్యుడిపై మోపుతున్నాయని చెప్పారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వాడుకున్న విద్యుత్‌ కంటే అదనపు ఛార్జీలనే రాష్ట్రం ప్రభుత్వం అధికంగా వసూలు చేస్తోందని వాపోయారు. సామాన్యులు కరెంట్‌ బిల్లు చూస్తే షాక్‌ గుర్యేలా ఛార్జీలు పెంచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ట్రూప్‌, సర్దుబాటు ,తదితర ఛార్జీలు, స్మార్ట్‌మీటర్ల పేరుతో వినియోగదారులను నిలువుదోపిడీ చేసు ్తన్నాయని చెప్పారు. వాడుకున్న విద్యుత్‌కు చెల్లించే బిల్లుగాక అదనంగా మరో ఆరు రకాల ఫిక్స్‌డ్‌, కస్టమర్‌, విద్యుత్‌ డ్యూటీ, ట్రూప్‌అప్‌, సర్దుబాటు, ఇందన, ఇందన సర్దుబాటు ఛార్జీల పేరుతో సామాన్యుడిని పీల్చి పిప్పి చేస్తోందని పేర్కొన్నారు. 2014 నుండి 2019, 2019 నుండి 2021, 2021-2022 ఆర్థిక సంవ త్సరానికి వాడిన విద్యుత్‌ను ఇప్పుడు వసూలు చేస్తున్నారని చెప్పారు. గతంలో వాడిన విద్యుత్‌కు యూనిట్‌కు ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు 0.20 పైసలు, జులై నుంచి సెప్టెంబరు వరకు యూ నిట్‌కు 0.63 పైసలు, అక్టోబర్‌ నుంచి డిశంబరు వరకు యూనిట్‌కు 0.57 పైసలు జనవరి నుండి మార్చివరకు యూ నిట్‌కు 0.66 పైసలు చొప్పున వసూలు చేస్తున్నారని పేర్కొ న్నారు. ఆత్మనిర్భత్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతోనే రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటుకు అను మతించిందని చెప్పారు. రాష్ట్రంలో విద్యుత్‌ సంస్కరణలు వేగంగా అమలు చేస్తున్నా రన్నారు. విద్యుత్‌ పంపిణీ వ్యవ స్థను కూడా ప్రయివేటీకరించాలని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తోం దన్నారు. ఇలా విద్యుత్‌ ఛార్జీలు పెంచు కుంటూ పోతే గత టిడిపికి పట్టిన గతి ప్రస్తుత ప్రభు త్వానికి పడుతుందని హెచ్చరించారు. వినాశకర విద్యుత్‌ విధా నాలను, దోపిడీకి వ్యతిరేకంగా ఐక్య ఉద్య మాలు చేపట్టి విద్యుత్‌ ఛార్జీలు తగ్గించే వరకు వామ పక్షాల ఆధ్వర్యంలో చేపట్ట బోయే ఉద్య మాల్లో వినియోగదారులు స్వ చ్ఛం దంగా పాల్గొనాలని పిలుపు నిచ్చారు. కార్యక్ర మంలో ఎఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ, ఎపి రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వంగిమళ్ళ రంగా రడ్డి, మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి సు మిత్రమ్మ, దళిత హక్కుల పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి సుదీర్‌ కుమార్‌, ఎఐటియుసి రాయచోటి పట్టణ కార్యదర్శి పుల ్లయ్య, ఎఐఎస్‌ఎఫ్‌ నాయ కులు లోకేష్‌, ప్రశాంత్‌, సునీత పాల్గొన్నారు.
రాజంపేట అర్బన్‌ : విద్యుత్‌ ఛార్జీల దోపిడీ స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటును ఉపసం హరిం చుకోవాలని సిపిఎం, సిపిఐ నాయకులు డిమాండ్‌ చేశారు. ప్రజలపై పెనుభారం మోపుతున్న విద్యుత్‌ఛార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష పార్టీల ఉద్య మంలో భాగంగా రాజంపేట సబ్‌ స్టేషన్‌ వద్ద శుక్రవారం సిపిఐ, సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా కార్య క్రమం నిర్వహించారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి పి.మహేష్‌, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు సి.రవి కుమార్‌ సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ఎం.శివరామకష్ణదేవరా, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి నరసింహ, ఎఐవైఎఫ్‌ నాయకులు శరత్‌, ఎఐఎస్‌ఎఫ్‌ నాయకులు మహమ్మద్‌, నాయకులు పాల్గొన్నారు.
మదనపల్లె అర్బన్‌: రాష్ట్రంలో విద్యుత్‌ ఛార్జీలు పెంచి ప్రజలపై పెనుభారం మోపే విధానం రాష్ట్ర ప్రభుత్వం విరమిం చుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు కష్ణప్ప డిమాండ్‌ చేశారు. వామపక్ష పార్టీల పిలుపు మేరకు శుక్రవారం మదనపల్లి తిరుపతి రోడ్డు విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ వద్ద సిపిఎం, సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వ హించారు. ఈ సందర్భంగా వారు మాట్లా డుతూ విద్యుత్‌ చార్జీలభారం-స్మార్ట్‌ మీట ర్లకు పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విని యోగదారులను నిలువుదోపిడీ చేస్తు న్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు ప్రభాకర్‌ రెడ్డి, హరినాథ్‌ శర్మ, వెంకటేష్‌, సిపిఐ నాయ కులు సురేష్‌ కుమార్‌, తిరుమల,దేవ, ఓబు లేసు, రఘునాథ్‌, రమణ సహదేవ పాల్గొన్నారు.
రైల్వేకోడూరు : విద్యుత్‌ ఛార్జీల పెంపునకు నిరసనగా, రైల్వే కోడూరు సబ్‌ డివిజన్‌ ఏడి ఆఫీస్‌ వద్ద శుక్రవారం ఉదయం, సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు సిహెచ్‌ చంద్రశేఖర్‌ మాట్లాడుతూ, అధికారంలోకి వచ్చిన వైసిపి ప్రభుత్వం ముఖ్యమంత్రి వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డి నాలుగు సంవ త్సరాలలో 25 వేల కోట్లు విద్యుత్‌ చార్జీలు ప్రజల పైన భారాల మోపారన్నారు. గత సంవత్సరం రూ. 1400కోట్లు, తిరిగి నేడు రూ 6000 కోట్లు వేశారన్నారు. పెంచిన విద్యుత్‌ ఛార్జీలు స్మార్ట్‌ మీటర్లు, ఉపసం హరించుకోకపోతే, గతంలో టిడిపి చంద్ర బాబుకి పట్టిన గతే జగన్మోహన్‌ రెడ్డి పడు తుందని హెచ్చరించారు.కా ర్యక్రమంలో, సిపిఎం పార్టీ మండల నాయకులు బొజ్జ శివయ్య, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు పి జాన్‌ ప్రసాద్‌, మండల నాయకులు జగదీష్‌, లతీపు,సందీప్‌, చందు, కార్తీకు, రోహిత్‌ ,ఉదరు, సిపిఐ నియోజకవర్గ కార్య దర్శి జ్యోతి చిన్నయ్య, మండల కార్యదర్శి, రాజశేఖర్‌, దార్ల నాగేశ్వరరావు, నాగమ్మ, కాంగ్రెస్‌ ఇంచార్జి గోసులాదేవి, జిల్లా కార్యదర్శి శాంతయ్య, రమేష్‌ పాల్గొన్నారు.