- ఎంపీపీ గోము వెంకటలక్ష్మి
ప్రజాశక్తి-రాజవొమ్మంగి: మండలంలోని తంటికొండ పంచాయితి తంటికొండ గ్రామంలో రంపంచోడవరం నియోజకవర్గ ఎంఎల్ఏ నాగులాపల్లి ధనలక్ష్మి సూచనలు మేరకు రూ5లక్షలు ఎంపిపి నిదులనుండి సిసి రహదారి నిర్మాణ పనులకు గ్రామ సర్పంచ్ ఆగూరి సుభలక్ష్మి అధ్వర్యంలో ఎంపీపీ గోము వెంకటలక్ష్మి, జెడ్పీటీసీ ఒడుగుల జ్యోతి ముఖ్య అతిథిలుగా హాజరై శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ అవుగడ్డ నిర్మలదేవి,ఉప సర్పంచ్ పల్లి వెంకటరమణ, మాజీ సర్పంచ్ కనిగిరి దుర్గప్రసాద్ వార్డ్ సభ్యులు అవుగడ్డ సత్యనారాయణ, గవురెడ్డి వీరబాబు ఇంజనీరింగ్ అసిస్టెంట్ వెంకటేష్, హౌసింగ్ వర్క్ ఇన్స్పెక్టర్ శ్రీను గ్రామస్తులు పాల్గొన్నారు.










