- ఉప సర్పచ్ అక్మల్
ప్రజాశక్తి-వి.కోట : మేజర్ గ్రాపంచాయతీ అయిన వి కోటలో జడ్పీ చైర్మన్ శ్రీనివాసులు సహకారంతో జడ్ పి నిధులు మంజూరు చేయడం వల్ల అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని గ్రామంచాయతీ ఉపసర్పచ్ అక్మల్ తెలిపారు. పంచాయ్ తీ పరిధిలోని పట్రపల్లిలో బుదవారం రూ. 2.50 లక్షల అంచనాతో మంజూరైన సిసి రోడ్డుకు వారు భూమిపూజ చేసి పనులుప్రారంబించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రజలకు మౌలిక వసతులు కల్పనకు సహకరిస్తున్న జిల్లా పరిషత్ చైర్మన్ కు కృతజ్ఞతలు తెలిపారు. సర్పంచ్ పి యన్ లక్ష్మి ఆధ్వర్యంలో గ్రామపంచాయతీని ఆదర్శ పంచాయతీగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. చైర్మన్ తనయుడు నరేంద్ర సహకారంతో మండలంలోని అన్ని గ్రామాల ప్రజలకు ఉచితంగా మొక్కలు పంపిణీ చేయడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు వారు చేస్తున్న కృషిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ వెంకటాచలపతి, వార్డ్ సభ్యులు కృష్ణప్ప, వైసిపి నేత కృష్ణమూర్తి గ్రామస్తులు పాల్గొన్నారు.










