Sep 20,2023 23:50

ప్రజాశక్తి - భట్టిప్రోలు( చుండూరు)
చుండూరులో బుధవారం టిడిపి ఆధ్వర్యంలో 8వ రోజు నిరాహార దీక్ష చేశారు. దీక్షలో మాజీ మంత్రి, టిడిపి పోలీస్ బ్యూరో సభ్యులు నక్క ఆనందబాబు మాట్లాడారు. మరో ఆరునెలల్లో టిడిపి అధికారానికి వస్తుందన్నారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు మైనేని మురళీకృష్ణ, కనగాల మధుసూదన్ ప్రసాద్, జొన్నలగడ్డ విజయబాబు, తూనుగుంట్ల సాయిబాబా, ఒక శేషుబాబు, వేములపల్లి జగన్నాధరావు, బట్టు మల్లికార్జునరావు, సిరాజ్, జయశీలరావు పాల్గొన్నారు.