చట్టసభల్లో మహిళలకు సముచిత స్థానం కల్పించాలి : ఐఎఫ్టియు
ప్రజాశక్తి - శ్రీశైలం ప్రాజెక్టు
దేశంలో మహిళలకు చటసభల్లో సముచిత స్థానం కల్పించాలని ఐఎఫ్టియు నాయకులు పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సుండి పెంటలోని ఆటోనగర్ నందు బుధవారం ఐఎఫ్టియు ఆధ్వర్యంలో కార్యాలయము నందు సావిత్రి జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు వై. ఆశీర్వాదం మాట్లాడుతూ దేశంలో స్త్రీలపై సమాజం పట్ల అవలంబిస్తున్న విధానం బాధాకరమన్నారు. ఆధునిక యుగంలో మహిళలపై రోజురోజుకు జరుగుతున్న లైంగిక దాడులు, హత్యలు చేస్తున్న వారిపై కఠినమైన చర్యలు తీసుకునే ప్రభుత్వాలు కూడా వివక్షత చూపుతున్నాయని ఆరోపించారు. మహిళలు ఇకనైనా మేలుకొని పీడిత శ్రామిక మహిళలంతా ఒక తాటిపై ఏకం కావలసిన అవసరము ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు ఆటో మొబైల్ వర్కర్స్ యూనియన్ నాయకులు వెంకటేశ్వర్లు, బాబు, రాము, షేక్షావలి, విద్యార్థులు పాల్గొన్నారు.










