Jun 09,2023 00:57
స్కానింగ్‌ పరికరాన్ని పరిశీలిస్తున్న నోడల్‌ అధికారి డాక్టర్‌ వెంకటేశ్వర్లు

ప్రజాశక్తి-చీరాల: పట్టణంలోని హాస్పిటల్స్‌లో ఉన్న స్కాన్‌ సెంటర్స్‌ అన్నీ పిసిపి, ఎన్‌డిటి చట్టం ప్రకారం నడుచుకోవాలని, అటువంటి నియమాలను పాటించని స్కాన్‌ సెంటర్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ ఎస్‌ విజయమ్మ అన్నారు. మంగళవారం పట్టణం లోని పలు హాస్పిటల్లో ఉన్న స్కాన్‌ సెంటర్‌ విభాగాలను జిల్లా ఇమ్యు నైజేషన్‌ అధికారి డాక్టర్‌ టి వెంకటేశ్వర్లుతో కలిసి ఆమె స్వయం గా పరిశీలించారు. చీరాల పట్టణం లోని శంకర్‌ లాప్రోస్కోపీ అండ్‌ ఇన్ఫెర్టిలిటీ సెంటర్‌, ప్రేమ హార్ట్‌ హాస్పిటల్స్‌ రెండింటిలో అందించే సేవలు, కావలసిన పరికరాలు అందుబాటులో ఉన్న అన్నింటినీ పరిశీలించి నట్లు తెలిపారు. రెండు సెంటర్స్‌లోని స్కానింగ్‌ మిషన్లను పరిశీలించారు. శంకర్‌ లాప్రోస్కోపీ సెంటర్‌ హాస్పిటల్‌లో రెండు స్కానింగ్‌ మిషన్లు, ప్రేమ హాస్పిటల్‌లో ఒక స్కానింగ్‌ మిషన్‌ అధికారికంగా రిజిస్టర్‌ చేయించుకుని ప్రమాణాలకు అనుగుణంగా పనిచేస్తున్నట్లు గుర్తించినట్లు తెలిపారు. పట్టణంలోని అన్ని హాస్పిటల్స్‌ క్లినికల్‌ ఎస్టాబ్లిష్మెంట్‌ యాక్ట్‌ ప్రకారం స్కాన్‌ సెంటర్స్‌ అన్ని పిసిపి, ఎన్‌డిటి చట్టం ప్రకారం కింద నడుచుకోవాలని అన్నారు. కావున స్కాన్‌ సెంటర్‌ ఉన్న వైద్యులందరూ నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ ప్రభుత్వానికి సహకరించాలని కోరారు.