Sep 09,2023 23:36

ప్రజాశక్తి - చీరాల
చట్టానికి ఎవరూ అతీతులు కాదని, అందరూ సమానులే అని వైసిపి నియోజకవర్గ ఇన్చార్జి కరణం వెంకటేష్ బాబు అన్నారు. మండలంలోని  రామకృష్ణాపురం క్యాంపు కార్యాలయంలో ఆయన శనివారం విలేకరులతో మాట్లాడారు. చట్టం ఎవరి చుట్టం కాదని అన్నారు. తమ పార్టీ అధినేత సిఎం జగన్ మోహన్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకున్న తామంతా కట్టుబడి ఉంటామని  అన్నారు. చంద్రబాబు అరెస్టుపై టిడిపి శ్రేణులు చేస్తున్న వాక్యాలను ఖండించారు. స్కిల్ డెవలప్మెంట్ స్కీములో జరిగిన అవినీతి కేసులో మాజీ సీఎం చంద్రబాబుకు సంబంధించి అన్ని ఆధారాలతోనే పోలీసులు అరెస్టు చేశారని అన్నారు. చట్టాన్ని అందరూ గౌరవించాల్సిందేనని అన్నారు. టిడిపి శ్రేణులు రాష్ట్రంలో శాంతిబద్రతలకు విఘాతం కలిగిస్తుందన్నారు. ప్రజలు సమన్వయంతో వాస్తవాలు తెలుసుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో మునిసిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు, వైస్ చైర్మన్ శిఖాకొల్లి రామసుబ్బులు, అర్బన్ ఫైనాన్స్ కార్పొరేషన్‌ డైరెక్టర్ గవిని శ్రీనివాసరావు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కొండ్రు బాబ్జీ, ఆర్‌బికె చైర్మన్ కావూరి రమణరెడ్డి, వ్యవసాయ సలహా మండలి సభ్యులు పులి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.