Dec 21,2022 00:13

మావోయిస్టు మృతదేహం, పోలీసులు స్వాధీనం చేసుకున్న సామగ్రి

ఒక మావోయిస్టు మృతి
ప్రజాశక్తి-చింతూరు

చత్తీస్‌ఘడ్‌ రాష్ట్రంలోని జాపూర్‌ జిల్లా మిర్టూరు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని తిమ్నార్‌, పోరోవాడ అడవుల్లో మంగళవారం మధ్యాహ్నం ఎన్‌కౌంటర్‌ జరిగింది. పోలీసులకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక మావోయిస్టు మతి చెందాడు. మృతి చెందిన మావోయిస్టు బైరంగడ్‌ ఏరియా కమిటీ సభ్యుడు రాజుగా పోలీసులు గుర్తించారు. బైరంగడ్‌ ఏరియా కమిటీలో మావోయిస్టుల ఉనికిపై డిఆర్‌జి, ఎస్‌టిఎఫ్‌ పోలీసు బలగాలు సంయుక్తంగా కూంబింగ్‌ ఆపరేషన్‌ నిర్వహించారు. కాల్పుల అనంతరం ఘటనా స్థలంలో ఒక తుపాకీ, వంట పాత్రలు, వైర్లు ఇతర విప్లవ సాహిత్యం పోలీసులు స్వాధీనం పరుచుకున్నారు.