Sep 30,2022 23:28

మాట్లాడుతున్న న్యాయమూర్తి బులికృష్ణ

ప్రజాశక్తి- లీగల్‌ రిపోర్టర్‌ : జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కోర్టులోని న్యాయ సేవాసధన్‌లో జిల్లాలోని పోస్టల్‌ ఉద్యోగులకు న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్‌ సివిల్‌ జడ్జి కెకెవి. బులికృష్ణ మాట్లాడుతూ ఇంటింటికి న్యాయసేవ అనే నినాదంతో పోస్టల్‌ ఉద్యోగులకువివిధ చట్టాలపై ప్రాథమిక అవగాహన కల్పించాలన్న జాతీయ సంస్థ ఆదేశాల మేరకు ఈ సదస్సు నిర్వహించామన్నారు. రాజ్యాంగం, అరెస్ట్‌లపై లాయర్‌ కుప్పిలి మురళీధర్‌ అవగాహన కల్పించారు బాలల చట్టాలపై జిల్లా పిల్లల సంరక్షణ అధికారి సత్యనారాయణ వివరించారు.