అవగాహన సదస్సులో మాట్లాడుతున్న జూనియర్ సివిల్ జడ్జి శ్రీ తేజ సాయి
చట్టాలపై అవగాహన పెంచుకోవాలి : జడ్జి
ప్రజాశక్తి - ఆత్మకూర్
విద్యార్థినీ విద్యార్థులు, యువత చట్టాలపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆత్మకూర్ జూనియర్ సివిల్ జడ్జి శ్రీ తేజ సాయి అన్నారు. మంగళవారం ఆత్మకూరు పట్టణంలోని స్నేహ స్టడీ సర్కిల్ డీఎస్సీ కోచింగ్ సెంటర్ ఆవరణంలో ఏర్పాటు చేసిన న్యాయ విజ్ఞాన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రధానంగా యువత వాహన ప్రమాదాలకు సంబంధించిన చట్టాలు, భూ చట్టాలు, మహిళలకు ఉన్న చట్టాలను తెలుసుకోవాలన్నారు. ఈ చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో స్నేహ స్టడీ సర్కిల్ డైరెక్టర్ పి.ఆశ, న్యాయవాదులు శ్రీధర్, అడిగె హుస్సేన్ మియా, మాణిక్యరావు తదితరులు పాల్గొన్నారు.










