Jun 24,2023 20:25

వినతిపత్రం అందజేస్తున్న నాయకులు

ప్రజాశక్తి - హోళగుంద
సివిల్‌ రైట్స్‌ డే నిర్వహించి ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించాలని ఆంధ్రప్రదేశ్‌ దళిత సమాఖ్య, ఉషోదయ గ్రామీణ అభివృద్ధి సంస్థ ప్రెసిడెంట్‌ సిహెచ్‌.నాగరాజు, దళిత సమాఖ్య మండల అధ్యక్షులు నల్ల మల్లేష్‌ కోరారు. శనివారం డీఎస్పీ శ్రీనివాస రెడ్డి, తహశీల్దార్‌ హుస్సేన్‌ సాబ్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ప్రతినెలా చివరి రోజు పౌర హక్కుల దినోత్సవం జరుపుకోవడం, ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పిస్తే వారిని చైతన్య పరిచినట్లు అవుతుందన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు చట్టాలపై పూర్తి అవగాహన లేకపోవడం వల్ల అక్కడక్కడ ఘర్షణలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలు చిన్న, చిన్న విషయాలకు ఘర్షణలకు దిగకుండా ఉండాలంటే అంటరానితనం, అస్పృశ్యత, అత్యాచారాలపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత మండల స్థాయి అధికారులపై ఉందన్నారు. ఇప్పటి నుంచి ప్రతి గ్రామంలోనూ నెల చివరి రోజు పౌర హక్కుల దినోత్సవం నిర్వహించాలని కోరారు. రామాంజనేయులు, ముగ్గు గోవిందు పాల్గొన్నారు.