
ప్రజాశక్తి - రేపల్లె
మారుతున్న సమాజానికి అనుగుణంగా సుప్రీంకోర్టు, హైకోర్టు చేస్తున్న చట్టాలను మహిళలు తెలుసుకొని తమ హక్కులు కాపాడుకోవాలని న్యాయ సేవ అధికార సంస్థ చైర్మన్, సీనియర్ సివిల్ జడ్జి వెంకటేశ్వర్లు అన్నారు. జాతీయ న్యాయ సేవ దినోత్సవం సందర్భంగా పట్టణంలోని ఐసిడిఎస్ కార్యాలయంలో ఉచిత న్యాయ విజ్ఞాన సదస్సు గురువారం నిర్వహించారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన దిశ యాప్ గురించి మహిళలు పూర్తి అవగాహన కలిగి ఉండాలని అన్నారు. బాలికలపై జరుగుతున్న లైంగిక వేధింపులకు సంబంధించిన ఫోక్సో చట్టం గురించి అవగాహన కలిగి ఉండాలని అన్నారు. బాల్య వివాహాలు, వరకట్న నిషేధం, వరకట్న వేధింపులు, భూతగాదాలు, బాలకార్మిక నిర్మూలన వ్యవస్థ, ఫోక్సో తదితర చట్టాలపై అవ గాహన కల్పించారు. చట్టాలను తెసుకోవాలని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ ఎల్ జగదీష్ కుమార్ అన్నారు. కార్యక్రమంలో న్యాయవాది కె శ్రీనివాసరావు, డిఎస్ హరికుమార్, ఐసిడిఎస్ ప్రాజెక్ట్ సిబ్బంది, పారా లీగల్ వాలంటీర్లు పాల్గొన్నారు.