Nov 20,2023 21:50

మాట్లాడుతున్న సన్యాసినాయుడు

ప్రజాశక్తి - శ్రీకాకుళం: విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండడం ఎంతో అవసరమని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఆర్‌.సన్యాసినాయుడు అన్నారు. నగరంలోని ప్రభుత్వ ఐటిఐలో న్యాయ అవగాహనా సదస్సును సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చట్టాలపై అవగాహన కలిగి ఉండడం ద్వారా అనవసరమైన తగాదాలకు దూరంగా ఉండవచ్చని చెప్పారు. ఆర్థిక స్తోమత లేని వారికి లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌ సిస్టం ద్వారా ఉచితంగా కేసులు నడిపిస్తారని తెలిపారు. విద్యార్థులు లోకాయుక్త పైనా అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగి విధులు సక్రమంగా నిర్వహించకపోతే లోకాయుక్తకు ఫిర్యాదు చేయొచ్చని చెప్పారు. కార్యక్రమంలో న్యాయవాది గేదెల ఇందిరా ప్రసాద్‌, సామాజిక కార్యకర్త మంత్రి వెంకటస్వామి, కళాశాల ట్రైనీ ఆఫీసర్‌ ఎన్‌.లక్ష్మణరావు, డిప్యూటీ ట్రైనింగ్‌ ఆఫీసర్‌ ఎస్‌.గోవిందరావు, ట్రైనింగ్‌ ఆఫీసర్‌ ఎం.మురళీకృష్ణ, విద్యార్థులు పాల్గొన్నారు.